ఫేస్బుక్ లో మరో నాలుగు సెక్యూరిటి ఫీచర్లు…!

-

వినియోగదారుల భద్రత విషయంలో ఫేస్బుక్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎక్కడా కూడా తమ వినియోగదారుల సమాచారాన్ని లీక్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది ఆ సంస్థ. పలు దేశాల్లో ఫేస్బుక్ భద్రతపై ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ఎప్పటికప్పుడు సెక్యురిటిని ఆ సంస్థ పెంచుతూ వస్తుంది. 2014 లో ప్రవేశ పెట్టిన ప్రైవసీ చెకప్ టూల్ కు కొత్తగా నాలుగు ఫీచర్లను జోడించింది. వాటిని ఉపయోగిస్తే సమాచారం భద్రంగా ఉంటుందని ఆస్ట్రేలియా సూచిస్తుంది. అవి ఏంటో ఒకసారి చూద్దాం.

Who can see what you share: వినియోగదారులు తమ ప్రొఫైల్ సమాచారం, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ అడ్రెస్ వంటి వ్యక్తిగత వివరాలను ఎవరెవరు చూస్తున్నారో సమీక్ష చేయడంతో పాటుగా తమ పోస్టులు చూసే వారిని నియంత్రించే అవకాశం ఉంది.

How to keep your account secure: దీని ద్వారా మీ ఫేస్ బుక్ ఖాతా భద్రత ఎలా ఉంది? మీ అకౌంట్ కు బలమైన పాస్ వర్డ్ ను ఎలా సెట్ చేసుకోవాలి? ఎప్పుడు మీ ఖాతాలో లాగిన్ అయినా దానికి సంబంధించిన సమాచారాన్ని ఎలా పొందాలి? అనే విషయాలను తెలుసుకోవచ్చు.

How people can find you: ఫేస్ బుక్ లోని మిగతా సభ్యులు మీ ఖాతాను ఎలా కనుగొనగలరు? మీకు ఎవరు ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెట్టగలరు? వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవచ్చు.

Your Data Settings on Facebook: లాగిన్ అయినప్పుడు ఏయే యాప్ లకు మీ ఫేస్ బుక్ సమాచారాన్ని అందించారో తెలుసుకోవచ్చు. మీరు ఉపయోగించని యాప్స్ లో గతంలో ఎప్పుడైనా లాగిన్ అయి ఉంటే.. వాటికి అందించిన యాక్సెస్ ను కూడా తొలగించే సదుపాయం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news