మొబైల్స్ తయారీదారు జియోనీ తక్కువ ధరలకే 3 కొత్త స్మార్ట్ వాచ్‌లను భారత్‌లో సోమవారం విడుదల చేసింది. జియోనీ వాచ్ 4 (జీఎస్‌డబ్ల్యూ 4), వాచ్ 5 (జీఎస్‌డబ్ల్యూ 5), సెనొరిటా స్మార్ట్‌వాచ్ (జీఎస్‌డబ్ల్యూ 3) పేరిట ఈ మూడు వాచ్‌లు విడుదలయ్యాయి. వీటిలో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
జియోనీ వాచ్ 4 (జీఎస్‌డబ్ల్యూ 4)
ఇందులో 1.2 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 240 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, నోర్డిక్ ఎన్ఆర్ఎఫ్ 52840 ప్రాసెసర్, బ్లూటూత్ 5.0, హార్ట్ రేట్ సెన్సార్, డిస్టాన్స్, స్టెప్, క్యాలరీ కౌంటర్, స్లీప్ మానిటరింగ్, యాక్టివిటీ ట్రాకర్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్లకు సపోర్ట్, 12 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
జియోనీ వాచ్ 5 (జీఎస్‌డబ్ల్యూ 5)
ఇందులో 1.3 ఇంచుల డిస్‌ప్లే, 240 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, నోర్డిక్ ఎన్ఆర్ఎఫ్ 52832 ప్రాసెసర్, బ్లూటూత్ 4.0 ఫీచర్లను అందిస్తున్నారు. ఇక మిగిలిన ఫీచర్లన్నీ వాచ్ 4ను పోలి ఉంటాయి. కాకపోతే ఈ వాచ్ కేవలం 5 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను మాత్రమే ఇస్తుంది.
జియోనీ సెనొరిటా స్మార్ట్‌వాచ్ (జీఎస్‌డబ్ల్యూ 3)
ఇందులో 1.04 ఇంచుల ఐపీఎస్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 240 x 198 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, నోర్డిక్ 52832 ప్రాసెసర్, బ్లూటూత్ 4.0.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు. మిగిలిన ఫీచర్లు వాచ్ 4 లోనివే ఉన్నాయి. ఈ వాచ్ కూడా 5 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది.
కాగా వాచ్ 4 ధర రూ.4599 ఉండగా, వాచ్ 5 ధర రూ.2499గా ఉంది. అలాగే సెనొరిటా స్మార్ట్‌వాచ్ ను రూ.3499కు విక్రయించనున్నారు. మంగళవారం నుంచి ఈ వాచ్‌లను ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు.