గూగుల్‌ కొత్త టెక్నాలజీతో మనిషి కంటే ఫాస్ట్‌గా ఆలోచించే చిప్స్‌!

-

గూగుల్‌ ఓ కొత్త టెక్నాలజీని రూపొందిస్తోంది. ఎప్పుడూ కొత్త ఫీచర్లను పరిచయం చేసే గూగుల్‌ ఇప్పుడు ఈ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తేనుంది. మనిషి ఒక రోజు చేసే పనిని కేవలం ఒక్క గంటలోనే పూర్తి చేసే గూగుల్‌ కొత్త టెక్నాలజీ పని చేయనుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో చిప్స్‌ను రూపొందిస్తుంది. దీన్ని మెషీన్‌ లెర్నింగ్‌ ద్వారా తయారు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా గూగుల్‌ ఈ చిప్స్‌ తయారీని ప్రారంభించింది. ఈ నయా సాంకేతికతకు కంప్యూటేషన్‌ ఆప్టిమైజేషన్‌కు గూగుల్‌ వాడే టెన్సార్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌తో తీసుకొస్తున్నారు. సైంటిస్టులు చిప్స్‌పైన ట్రాన్సిస్టర్లను పెంచకుండా.. వాటి పనితనం పెంచేలా ఈ ప్రయోగం రూపొందిస్తోంది.

మామూలుగా అల్గారిథమ్స్‌ ఎక్కువగా ఫ్లోర్‌ ప్లానింగ్‌ను టాకిల్‌ చేస్తూ ఉంటాయి. చిప్‌ సబ్‌ సిస్టమ్స్‌ కోసం సిలికాన్ డైలోని లే అవుట్‌ వెతకడానికి హ్యూమన్ డిజైనర్లు సిస్టమ్స్‌ వాడుతుంటారు. దీని కోసం సీపీయూ, జీపీయూ, మెమొరీ కోర్స్‌ ఉంటాయి. ఆ ప్లేస్‌మెంట్‌ వల్లే చిప్‌ వేగం పెరుగుతుంది. ఈ ఫ్లోర్‌ డిజైనింగ్‌ను మనుషులు చేయడానికి ఎక్కువ సమయం పడుతోందని గూగుల్‌ గుర్తించింది. ఇప్పటికే మనుషుల్ని మించి పనితనం చూపిస్తుందంటూ శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు.

ఇందులో భాగంగా లెర్నింగ్‌ అల్గారిథమ్‌కు పదివేల చిప్స్‌ ఉన్న ఫ్లోర్‌ ట్రైనింగ్‌ ఇచ్చారట. ఈ క్రమంలో గుడ్, బ్యాడ్‌ ఫ్లోర్‌ ప్లాన్స్‌ను అల్గారిథమ్‌ నిర్ణయించుకునేలా శిక్షణ ఇచ్చారు. ఏఐ సిస్టమ్స్‌ మనుషుల్లా ఆలోచించవు అని బోర్డు గేమ్స్‌ ఆడే క్రమంలోనే తెలిసిపోయింది. అలాగే ఫ్లోర్‌ ప్లాన్స్‌ విషయంలోనూ గూగుల్‌ ఏఐ నడుచుకుంటుంది. మనుషులు చేసే ఫ్లోర్‌ డిజైన్‌తో సిద్ధం చేసిన ఫ్లోర్‌ డిజైన్ చాలా తేడాలు కనిపించాయట.

Read more RELATED
Recommended to you

Latest news