కరోనా నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలు, కార్యాలయ పనులు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. దీంతో వర్చువల్ మీటింగ్‌లు ఎక్కువ ఆదకణ పెరిగింది. అదేవిధంగా ఈ ఆన్‌లైన్ వీడియో యాప్స్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. వాటి మధ్య పోటీ కూడా పెరిగింది. ఇప్పటికే గూగుల్ అనేక ఫీచర్లను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా గూగుల్ మీట్ (Google Meet) లో నయా ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. దీంతో బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు.
వినియోగదారులు ఎలా దీన్ని సెట్ చేసుకోవడంపై తగిన ఆదేశాలను కూడా జారీ చేసింది గూగుల్. వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్ గా దీన్ని నామకరణం చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు కేవలం వెబ్ వెర్షన్‌కు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్ ఇప్పుడు ఆండ్రాయిడ్ వెర్షన్‌కు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నయా ఫీచర్‌తో గూగుల్ మీట్ యూజర్లు ఆఫీస్ ప్లే స్పేస్, ప్రకృతి దృశ్యాలను ఇమేజ్‌లుగా తమ వీడియో బ్యాంక్‌గ్రౌండ్‌గా సెట్ చేయవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్‌కే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ త్వరలో ఐఓఎస్‌కు కూడా పరిచయం చేయనుంది.
- దీనికి మొదట వినియోగదారులు సెల్ఫ్ వ్యూ స్క్రీన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ‘చేంజ్ బ్యాక్ గ్రౌండ్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే.. ‘బ్లర్ యువర్ బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్ కనిపిస్తుంది.
- ‘స్లైట్లీ బ్లర్ బ్యాక్ గ్రౌండ్’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు ప్రీ లోడెడ్ ఇమేజ్ కోసం బ్యాక్‌గ్రౌండ్ ఎంపిక చేసుకోవాలి. దీంతో మీ వీడియో కాలింగ్ బ్యాక్‌గ్రౌండ్ వాల్ పేపర్ మారిపోతుంది.
- గూగుల్ మీట్ ఇటీవల యూజర్ ఇంటర్‌స్పేస్(యూఐ)లోనూ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. కొత్త యూఐ సెట్టింగ్‌లో అవసరమైన అన్ని ఆప్షన్ యాక్సెస్ చేయడానికి బాటమ్‌లో ఓ యూఐ బార్‌ను జత చేసింది. ఈ బార్లో మీటింగ్ కోడ్, మైక్రో ఫోన్, వీడియో, హ్యాండ్ రైజ్, స్క్రీన్ షేరింగ్ వంటి టూల్స్ జతచేసింది. రైట్ బాటమ్లో జాయినింగ్ ఇన్ఫో, పీపుల్ ప్యానెల్, చాట్ ప్యానెల్, బ్రేక్ అవుట్ రూమ్స్, పోల్స్ వంటి సమావేశం వివరాలను కూడా తెలుసుకోవచ్చు.