ఫైనల్ గా ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న ఫీచర్ వచ్చేసింది. యూజర్లు చాలా కాలం నుంచి వేచిచూస్తున్న ఫీచర్ ఇది. దీనిని త్వరలోనే తీసుకు రానున్నారు. ఐఫోన్ ఐఓఎస్ యూజర్స్ కి ఈ ఫీచర్ ఏడాది క్రితమే వచ్చేసింది. త్వరలో ఆండ్రాయిడ్ డివైజ్‌లకు కూడా రానుంది.
అదే ‘డిలీట్ లాస్ట్ 15 మినిట్స్ ఫీచర్. ఈ ఫీచర్‌తో 15 నిమిషాల రీసెంట్ బ్రౌజింగ్ హిస్టరీని సులువుగా డిలీట్ చేసేయచ్చు. పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ Delete Last 15 min ఫీచర్‌ను గూగుల్ గత ఏడాది తీసుకొచ్చింది. ఆ తర్వాత గత సంవత్సరం జూలైలోని iOS గూగుల్ యాప్ యూజర్లకు ఇది అందుబాటులోకి వచ్చింది.
ఇప్పుడు ఆండ్రాయిడ్ గూగుల్ యాప్‌కు కూడా ఈ ఫీచర్ తెచ్చేందుకు గూగుల్ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్గా బ్రౌజ్ చేసిన హిస్టరీని మాత్రమే డిలీట్ చేసుకోవాలంటే ఇది సూపర్ ఫీచర్ అని చెప్పచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ ఫీచర్ వాడాలంటే గూగుల్ యాప్‌లోకి వెళ్లి ప్రొఫైల్ బటన్‌పై క్లిక్ చేస్తే Delete Last 15 min ఆప్షన్ పైన క్లిక్ చెయ్యాలి.
గత 15 నిమిషాల్లో చేసిన బ్రౌజింగ్ హిస్టరీ అంతా డిలీట్ అయిపోతుంది. దీనితో రీసెంట్ హిస్టరీ ని మనం ఒకే క్లిక్ తో క్లియర్ చేసేయచ్చు. కాగా 3 నెలలు, 18 నెలలు, 36 నెలలకు కంటెంట్ ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా ప్రస్తుతం గూగుల్ యాప్‌లో ఆప్షన్ ఉంది.