ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులకు వైఎస్ జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రబీ సీజన్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులు పండించిన పప్పు ధాన్యాలను కొనుగోలు చేస్తామని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించింది. వచ్చె నెల ఏప్రిల్ నుంచే పప్పు ధాన్యాలను కొనుగోలు చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో పెసలు, మినుములతో పాటు ఇతర పప్పు ధాన్యాలను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
కాగ ఈ రబీ సీజన్ కు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 1,26,270 టన్నుల శనగలను, 91,475 టన్నుల మినుములను, 19,632 టన్నుల పెసలు ను కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే పప్పు ధాన్యాలకు మద్దతు ధరను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి క్వింటాల్ పెసలుకు రూ. 7,275 గా నిర్ణయించింది. అలాగే క్వింటాల్ శనగలకు రూ. 5,230 గా, మినుములు, కందులకు ప్రతి క్వింటాలకు రూ. 6,300 గా మద్దతు ధరను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.