సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్ ప్రతి ఏడాది గూగుల్ ప్లే స్లోర్ లోని బెస్ట్ యాప్స్, గేమ్స్ జాబితాను విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాదికి కూడా బెస్ట్ యాప్స్, గేమ్స్ జాబితాను గూగుల్ విడుదల చేసింది. ఈ ఏడాదికి.. స్లీప్ స్టోరీస్ ఫర్ కామ్ స్లీప్ అండ్ మెడిటేషన్ బై వైసా.. అనే యాప్ ఉత్తమ యాప్‌గా నిలిచింది. ఇక వివిధ విభాగాల్లో టాప్ ప్లేస్‌లలో నిలిచిన ఉత్తమ యాప్‌లు, గేమ్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఫ్రీ ఆడియో స్టోరీస్, బుక్స్, పాడ్‌కాస్ట్స్ – ప్రతిలిపి ఎఫ్ఎం, మోజ్ – షార్ట్ వీడియో యాప్, ఎంఎక్స్ టకాటక్, రెఫాస్, విటా యాప్‌లు బెస్ట్ యాప్స్ ఫర్ ఫన్ విభాగంలో టాప్ ప్లేస్‌లో నిలిచాయి. అప్నా, మైండ్ హౌజ్, మై స్టోర్, రిట్కో యాప్‌లు బెస్ట్ యాప్స్ ఫర్ పర్సనల్ గ్రోత్ విభాగంలో టాప్‌లో నిలిచాయి.
అలాగే బెస్ట్ యాప్స్ ఫర్ ఎవ్రీడే ఎసెన్షియల్స్ జాబితాలో.. కూ, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ది ప్యాటర్న్, జెలిష్, జూమ్ క్లౌడ్ మీటింగ్స్.. యాప్‌లు నిలిచాయి. లెజెండ్స్ ఆఫ్ రుణెటెర్రా బెస్ట్ గేమ్ గా నిలిచింది. బుల్లెట్ ఎకో, కార్ట్ రైడర్ రష్ ప్లస్, లెజెండ్స్ ఆఫ్ రుణెటెర్రా, రంబుల్ హాకీ, టాప్ వార్ బ్యాటిల్ గేమ్ యాప్‌లు బెస్ట్ కాంపిటీటివ్ గేమ్స్‌గా నిలిచాయి. ఇక బెస్ట్ ఇన్నొవేటివ్, క్యాజువల్, ఇండీ గేమ్స్ జాబితాను కూడా గూగుల్ విడుదల చేసింది.