ఏపీ సర్కార్ కి మరో షాక్ తగిలే అవకాశం ఉందా…? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. పంచాయతీ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ వేయడంపై మళ్లీ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు అయింది. రంగులేసి తొలగించినందుకు రూ.4 వేల కోట్లయ్యాయని, వీటిని రాబట్టాలని పిటిషనర్ హైకోర్ట్ ని కోరారు. ఈ 4 వేల కోట్ల రూపాయలను ఖజానాకు జమ చేయాలని పిటీషన్ దాఖలు అయింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణలను వ్యక్తిగతంగా ప్రతివాదులుగా చేర్చి పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై అఫిడవిట్ సరిగా వేయాలని పిటిషనర్ ను హైకోర్ట్ ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులను వ్యక్తిగతంగా ప్రతివాదులుగా ఎందుకు చేర్చారని న్యాయస్థానం ప్రశ్నించింది. 4 వేల కోట్లు కాబట్టి హైకోర్ట్ ఏ తీర్పు ఇస్తుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.