గ్రేటర్ ఎన్నికల్లో చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడిక్కడ బీజేపీ – టీఆర్ఎస్ నేతలు తన్నుకునే పరిస్థితి నెలకొంది. తాజాగా వారసిగూడ లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు కుమారుడు కిరణ్ ,బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీజేపీ ఆరోపణలు చేస్తూ ఆయన ఉన్న చోటకు చొచ్చుకు వచ్చింది. అక్కడ ఇరు వర్గాల వారు చొక్కాలు చింపుకొని మరీ కొట్టుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేశారు.
ఇక బౌద్ధ నగర్ లో బూత్ల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థికి మరియు టిఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జారింది. డబ్బులు పంచుతున్నారు అని కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపిస్తున్నారు. ఎస్సై రాజశేఖర్ గౌడ్ తో వాగ్వాదానికి దిగారు కాంగ్రెస్ నాయకులు. అలానే ఉప్పల్ పదవ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి రీ పోలింగ్ నిర్వహించాలని ధర్నా చేస్తున్నారు.