భార‌త్‌లో యూట్యూబ్‌, జీమెయిల్ స‌హా అన్ని గూగుల్ సేవ‌ల‌కు అంత‌రాయం

-

భార‌త‌దేశ వ్యాప్తంగా ఉన్న యూజ‌ర్లు కాసేపు గూగుల్ సేవ‌ల‌ను వినియోగించుకోలేక‌పోయారు. గూగుల్‌కు చెందిన యూట్యూబ్, జీమెయిల్‌, గూగుల్ సెర్చ్, గూగుల్ డ్రైవ్‌, గూగుల్ ప్లే, మ్యాప్స్, హ్యాంగ‌వుట్స్, గూగుల్ డ్యుయో, గూగుల్ మీట్‌, డాక్స్, స్లైడ్స్‌, క్యాలెండ‌ర్‌, చాట్ త‌దిత‌ర అన్ని సేవ‌లు కొంత సేపు నిలిచిపోయాయి. దీంతో యూజ‌ర్లకు కాసేపు ఏం జ‌రుగుతుందో తెలియలేదు.

google servers are down in india and in some countries

దేశ‌వ్యాప్తంగా ఉన్న యూజ‌ర్లే కాక యూర‌ప్‌, అమెరికాల్లోని ప‌లువురు యూజ‌ర్ల‌కు కూడా గూగుల్ సేవ‌లు కాసేపు ల‌భించ‌లేదు. దీంతో యూజ‌ర్లు పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. ఇక వెబ్‌సైట్ల సేవ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించే డౌన్ డిటెక్ట‌ర్ అనే వెబ్‌సైట్‌కు ఏకంగా యూట్యూబ్ గురించే 26వేల‌కు పైగా ఫిర్యాదులు వ‌చ్చాయి.

అయితే ప్ర‌స్తుతానికి అన్ని గూగుల్ స‌ర్వీసుల‌కు ఎలాంటి అంత‌రాయం క‌ల‌గ‌డం లేద‌ని, అన్ని సేవ‌లు ల‌భిస్తున్నాయ‌ని తెలుస్తోంది. కానీ ఇప్ప‌టికీ కొంద‌రికి జీమెయిల్‌, యూట్యూబ్ యాక్సెస్ కావ‌డం లేద‌ని స‌మాచారం. వాటిని ఓపెన్ చేస్తుంటే ఎర్ర‌ర్ మెసేజ్ వ‌స్తుంద‌ని, కాసేపు ఆగాక ప్ర‌య‌త్నించాలంటూ మెసేజ్ చూపిస్తుంద‌ని యూజ‌ర్లు ఫిర్యాదులు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news