వాట్సాప్‌ నయా ఫీచర్లతో యూజర్లకు ఎన్నో ఉపయోగాలు!

-

ప్రముఖ మెసేంజర్‌ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తుంది. దీంతో తమ పోటీ యాప్‌లకు కూడా చెక్‌ పెడుతూ వస్తోంది. తాజాగా మరిన్ని కొత్త ఫీచర్లను కూడా పరీక్షిస్తుంది. ఆ వివరాలు తెలుసుకుందాం. ఇకపై ఆండ్రాయిడ్‌ యూజర్లు ఏఈ ఇమేజ్‌లను పంపుకోవచ్చు. అలాగే వాట్సాప్‌ చాట్‌ను కూడా స్టోర్‌ చేసుకోవచ్చు. ఇది కేవలం 2.21.1.5.5 యూజర్లకు మాత్రమే. ఇదివరకు మన చాట్‌ స్టోర్‌ అయ్యేది కాదు. తాజాగా బీటా వెర్షన్‌ లో ఈ సదుపాయం కల్పించింది. త్వరలోనే దీన్ని పూర్తిగా అభివృద్ధి చేయనుంది.


ఎప్పుడైనా మనం క్రియేట్‌ చేసిన చాల్‌ కావాలి అంటే.. చాట్‌ స్టోర్‌ ఫోల్డర్‌ ఓపెన్‌ చేయాలి. పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. దాంతో డేటాను మళ్లీ చూసే అవకాశం ఉంటుంది. ఒకవేళ పాస్‌వర్డ్‌ మర్చిపోతే మాత్రం ఫోల్డర్‌ ఓపెన్‌ కాదు. ఇక దానికి వాట్సాప్‌ ద్వారా 64 అంకెల కీ వాడుకోవాల్సి ఉంటుంది. ఈ కీ ద్వారా కొత్త పాస్‌వర్డ్‌ సెట్‌ చేసుకోవాలి. కొత్త పాస్‌వర్డ్‌ మాత్రం మర్చిపోకూడదు. అది కూడా మర్చిపోతే… ఇక చాట్‌ డేటా చూసే ఛాన్‌ ఉండదు. దీంతో పాటు వాట్సాప్‌ వినియోగదారులకు మరో ఫీచర్‌ కూడా కనువిందు చేయనుంది. అదే మొబైల్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయినప్పటికీ… వాట్సాప్‌ కాంటాక్టులు, చాటింగ్, మెసేజ్‌లను కంప్యూటర్, స్మార్ట్‌ డిస్‌ప్లేలపై చూడవచ్చు. చివరకు మీ ఫోన్‌ కు ఇంటర్నెట్‌ నెట్‌ కనెక్షన్‌ లేకపోయినా సాధ్యపడుతుంది. దీంతోపాటు మరో ఫీచర్‌ కూడా వాట్సాప్‌ త్వరలో పరిచయం చేయనున్న సంగతి తెలిసిందే! అదే.. మల్టీ డివైజ్‌ కనెక్ట్‌. దీంతో ఒక్క వాట్సాప్‌ ఖాతాతో నాలుగు ఇతర డివైజ్‌లకు కనెక్ట్‌ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news