ఒక్క ఐఫోన్‌ను ఏక‌బిగిన ఎన్ని సంవ‌త్స‌రాల వ‌రకు వాడ‌వ‌చ్చు ?

-

సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్‌కు చెందిన ఐఫోన్లు అంటే నాణ్య‌త‌కు, మ‌న్నిక‌కు పేరు. ఒక్క‌సారి ఐఫోన్‌ను కొనుగోలు చేస్తే అది ఏళ్ల త‌ర‌బ‌డి ప‌నిచేస్తూనే ఉంటుంది. కాక‌పోతే ఒక్క బ్యాట‌రీ స‌మ‌స్య వ‌స్తుంది. క‌నుక ఆ ఒక్క‌దాన్ని రీప్లేస్ చేస్తే ఏళ్ల‌కు ఏళ్లు ఒక్క ఐఫోన్‌నే వాడ‌వ‌చ్చు. అయితే ఒక ఐఫోన్ ను తీసుకుంటే స‌హజంగా దాన్ని ఎన్ని ఏళ్ల వ‌ర‌కు వాడ‌వ‌చ్చు ? అందుకు ఒక కాల ప‌రిమితి ఉంటుందా ? అంటే..

how many years one can use one iphone

ఐఫోన్ల‌ను ఇన్ని ఏళ్ల పాటు వాడాల‌ని రూల్ ఏమీ లేదు. న‌చ్చ‌క‌పోతే ఎప్ప‌టిక‌ప్పుడు మార్చేయ‌వ‌చ్చు. అది వారి స్థోమ‌త‌పై ఆధార ప‌డి ఉంటుంది. అయితే ఒక్క‌సారి ఐఫోన్ కొన్నాక దాన్ని చాలా మంది కొన్నేళ్ల పాటు వాడాల‌ని అనుకుంటారు. ఈ క్ర‌మంలో ప‌లు సంస్థ‌లు విశ్లేషించిన ప్ర‌కారం ఒక్క ఐఫోన్ స‌హ‌జంగానే 7 ఏళ్ల వ‌రకు మ‌న్నుతుంది. స‌రిగ్గా మెయింటెయిన్ చేయాలే గానీ ఒక ఐఫోన్‌ను 7 ఏళ్ల పాటు ఏక‌బిగిన ఉప‌యోగించ‌వ‌చ్చు. మ‌ధ్య మ‌ధ్య‌లో యాపిల్ కంపెనీ విడుద‌ల చేసే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు.

అయితే 7 ఏళ్ల వ‌ర‌కు స‌హ‌జంగా ఎవ‌రూ ఒక్క‌టే ఐఫోన్‌ను వాడ‌రు. కానీ 4 ఏళ్ల వ‌ర‌కు మాత్రం సుల‌భంగా వాడ‌వచ్చు. అప్ప‌టి వ‌ర‌కు ఆ ఫోన్ల‌లో ఎలాంటి స‌మ‌స్య‌లు రావు. అలాగే ఆ ఫోన్లు మ‌రీ పాత‌బ‌డ‌వు. అన్ని యాప్స్‌కు స‌పోర్ట్ చేస్తాయి. క‌నుక ఎవ‌రైనా స‌రే ఐఫోన్ల‌ను ఏళ్ల త‌ర‌బ‌డి ఉప‌యోగించాల‌నుకుంటే వాటిని 4, 5 ఏళ్ల వ‌ర‌కు ఏక‌బిగిన ఉప‌యోగించ‌వ‌చ్చు. ఎలాంటి స‌మ‌స్యా ఉండ‌దు. ఇంకా కావాలంటే ఇంకో ఏడాది కూడా.. అంటే 6 ఏళ్ల వ‌ర‌కు వాడ‌వ‌చ్చు. కానీ అప్ప‌టి వ‌ర‌కు సాఫ్ట్‌వేర్లు, హార్డ్‌వేర్‌, యాప్‌లు మారిపోతాయి. క‌నుక ఎవ‌రూ అంత‌కాలం ఐఫోన్ల‌ను వాడ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news