మీ స్మార్ట్‌ వాచ్‌తోనే బ్లడ్‌లోని ఆక్సిజన్‌ లెవల్‌ తెలుసుకోండి!

-

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మన శరీరంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ చాలా ముఖ్యంగా మారింది. ఒకవేళ బాడీలో ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోతే అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రిల్లో జాయిన్‌ అయ్యి, ఆక్సిజన్‌ అందించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది తెలుసుకోవడానికి ఏ కాస్త సమయం గడిచినా, ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే, ఆక్సిజన్‌ లెవల్స్‌ చూసుకోవడానికి పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. కేవలం మన చేతికి స్మార్ట్‌ వాచ్‌ ఉన్నా ఆక్సిజన్‌ లెవల్స్‌ తెలుసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం. మీ వద్ద ఉండే స్మార్ట్‌ వాచ్‌లోని SpO2 మెజర్‌మెంట్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంటుంది. అయితే దీన్ని ఎలా వాడాలో బ్రాండ్‌ల వారీగా తెలుసుకుందాం.

స్మార్ట్‌ బ్యాండ్‌తో ఆక్సిజన్‌ లెవల్స్‌ తెలుసుకునే విధానం

  • మీ స్మార్ట్‌ వాచ్‌ను సరైన పద్ధతిలో చేతికి పెట్టుకోవాలి.
  • SpO2 మెజర్‌మెంట్‌ పూర్తయ్యే వరకు వాచ్‌ను తీయవద్దు
  • మంచి ఫలితం కోసం చేతిని నిటారుగా పెట్టాలి
  • చేతికి టాట్టూ ఉన్నా, కదిపినా, టెంపరేచర్‌ తక్కువగా ఉన్నా, సరిగా పెట్టుకోకున్నా మెజర్‌మెంట్‌ను ప్రభావితం చేస్తాయి.

యాపిల్‌ వాచ్‌ సిరీస్‌6లో బ్లడ్‌ ఆక్సిజన్‌ యాప్‌ను ఏవిధంగా వాడాలి?

ఫోన్‌లోని ఐఫోన్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, ఆన్‌ చేయాలి. బ్రౌజ్‌ ట్యాబ్‌ను క్లిక్‌ చేయాలి. అప్పుడు respiratory>blood oxygen>set up blood oxygen సెట్‌ చేసి యాపిల్‌ వాచ్‌లో SpO2 మెజర్‌మెంట్‌ ద్వారా బ్లడ్‌ ఆక్సిజన్‌ లెవల్‌ను చూసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్‌లో ఈ యాప్‌ లేకున్నా, యాపిల్‌ స్టోర్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

రీయల్‌మీ ఫోన్‌..

రియల్‌ మీ ఫోన్‌లోని SpO2 పేజీని ఓపెన్‌ చేసి, ఆ యాప్‌ క్లిక్‌ చేసి,SpO2 మెజర్‌మెంట్‌ను స్టార్ట్‌ చేయాలి. ఫలితం రావడానికి ఓ 30 సెకండ్ల సమయం పడుతుంది.

ఫిట్‌బిట్‌ బ్యాండ్‌..

ఫిట్‌బిట్‌ బ్యాండ్‌ ఇతర స్మార్ట్‌ వాచ్‌లకు కాస్త వేరుగా ఉంటుంది.
SpO2 క్లాక్‌ ఫేస్‌ను డీఫాల్ట్‌లో పెట్టాలి. అప్పుడు హార్ట్‌ బీట్, స్టెప్‌ కౌంట్, ఫ్లోర్‌ కౌంట్, SpO2 ఆప్షన్లు ఉంటాయి.

సామ్‌సంగ్‌..

ఈ ఫీచర్‌ గెలక్సీ 3 వెర్షన్‌లో అందుబాటులో ఉంది. SpO2 మెజర్‌మెంట్‌ కోసం సామ్‌సంగ్‌ హెల్త్‌ యాప్‌ ఉండాలి.

హువాయి, హానర్‌..

ఇందులో హెల్త్‌ మానిటరింగ్‌ను ఆటోమెటిక్‌ SpO2ను ఎనేబుల్‌ చేయాలి. అప్పుడు ఆటోమెటిక్‌గా ఈ డివైస్‌ SpO2ను ట్రాక్‌ చేస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news