ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ ఫీచర్స్ చూస్తే అవాక్ అవ్వాల్సిందే..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది టెక్నాలజీ కి తగ్గట్టుగా నడుచుకుంటున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన టెక్నాలజీ హవా నడుస్తోంది. అయితే కొత్తగా స్మార్ట్ వాటర్ బాటిల్స్ కూడా వచ్చాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం యాపిల్ మార్కెట్ లోకి స్మార్ట్ వాటర్ బాటిల్స్ ని తీసుకొచ్చింది నిజంగా ఈ వాటర్ బాటిల్స్ అద్భుతంగా పని చేస్తాయి.

 

అమెరికాలో ప్రస్తుతం ఇవి అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఇండియాలో కూడా ఈ వాటర్ బాటిల్స్ రానున్నాయి. అయితే మరి ఈ స్మార్ట్ బాటిల్స్ వల్ల ఉపయోగం ఏమిటి..?, దీని వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది..? దీని యొక్క ఫీచర్స్ ఏమిటి అనే దాని గురించి చూద్దాం. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేయండి.

హైడ్రేర్ స్పార్క్ కంపెనీ తో ఆపిల్ పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. వాళ్ల భాగస్వామితో ఆపిల్ వాటర్ బాటిల్స్ ని విక్రయిస్తోంది. ఈ బాటిల్ తో మనం ఆపిల్ హెల్త్ యాప్ ద్వారా కనెక్ట్ కావచ్చు. అలానే దీనికి ఎల్ఈడి లైట్ ని కనెక్ట్ చేశారు. దాని తో ఎన్ని నీళ్లు తాగుతున్నారు అనేది కూడా మనం తెలుసుకో వచ్చు.

బ్లూటూత్ ఆప్షన్ ద్వారా కనెక్ట్ అయ్యే ఈ బాటిల్స్ యూజర్ యొక్క రోజు వారీ ఆక్టివిటీస్ ఆధారంగా నీటిని తీసుకోమని చెప్తూ ఉంటుంది. ఈ వాటర్ బాటిల్ ధర ఎంత అనేది చూస్తే.. స్టీల్ తో చేసిన బాటిల్ అయితే 6,129 అదే ప్లాస్టిక్ బాటిల్ అయితే 4,596. గ్రీన్, బ్లాక్ రెండు రంగుల్లో ఈ బాటిల్స్ ని తీసుకు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news