డాక్ట‌ర్ల‌కు క‌రోనా ఇన్‌ఫెక్ష‌న్ రిస్క్‌ను త‌గ్గించే.. స్మార్ట్ స్టెత‌స్కోప్‌..!

-

ఐఐటీ బాంబేకు చెందిన ఓ స్టార్ట‌ప్ బృందం స్మార్ట్ స్టెత‌స్కోప్‌ను రూపొందించింది. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్న నేప‌థ్యంలో క‌రోనా రోగుల‌కు చికిత్స అందించే వైద్యులు, వైద్య సిబ్బందికి కూడా క‌రోనా సోకుతోంది. అయితే వారికి క‌రోనా ఇన్‌ఫెక్ష‌న్ రిస్క్‌ను కొంత వ‌ర‌కు త‌గ్గించేందుకు గాను ఐఐటీ బాంబే స్టార్ట‌ప్ బృందం నూత‌నంగా.. ఓ స్మార్ట్ స్టెత‌స్కోప్‌ను త‌యారు చేశారు. ఇది స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా ప‌నిచేస్తుంది.

iit bombay startup developed new smart stethoscope for doctors who treat corona patients

ఐఐటీ బాంబేకి చెందిన ‘ఆయుడివైస్’ అనే స్టార్ట‌ప్.. స్మార్ట్ స్టెత‌స్కోప్‌ను రూపొందించింది. ఈ స్టెతస్కోప్‌ను రోగి ధ‌రించ‌గానే అత‌ని హార్ట్‌బీట్‌ను స‌ద‌రు స్టెత‌స్కోప్ గుర్తించి ఆ సౌండ్‌ను వైర్‌లెస్‌గా స్మార్ట్‌ఫోన్‌కు పంపుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ప్ర‌త్యేక‌మైన యాప్ స‌హాయంతో ఆ సౌండ్‌ను డాక్ట‌ర్లు విన‌వ‌చ్చు. దీంతో రోగిని ట‌చ్ చేయ‌కుండానే ఈ స్మార్ట్ స్టెత‌స్కోప్ ద్వారా అత‌ని హార్ట్ బీట్‌ను డాక్ట‌ర్లు సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు.

ఇక ఈ స్మార్ట్ స్టెత‌స్కోప్ ద్వారా వైద్యులు రోగి హార్ట్ బీట్ సౌండ్‌ను క్లియ‌ర్‌గా వినేందుకు గాను ఈ స్టెత‌స్కోప్‌కు నాయిస్ క్యాన్సిలేష‌న్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. దీని స‌హాయంతో స్టెత‌స్కోప్ బ్యాక్‌గ్రౌండ్ శ‌బ్దాల‌ను వీలైనంత వ‌ర‌కు త‌గ్గించి రోగి హార్ట్ బీట్‌ను సౌండ్ రూపంలో రికార్డు చేస్తుంది. కాగా ఈ స్టెత‌స్కోప్‌కు గాను ఆ స్టార్ట‌ప్ ఇప్ప‌టికే పేటెంట్‌ను పొంద‌గా.. దేశంలోని ప‌లు హాస్పిట‌ళ్ల‌లో వైద్యులు ఉప‌యోగించేందుకు గాను 1000 స్మార్ట్ స్టెత‌స్కోప్‌ల‌ను ఆ స్టార్ట‌ప్ ఇప్ప‌టికే పంపిణీ చేసింది. ఈ క్ర‌మంలో ఈ స్టెత‌స్కోప్ ప‌నితీరును బ‌ట్టి దానికి త్వ‌ర‌లో మ‌రిన్ని మార్పులు, చేర్పులు చేయ‌నున్నారు. ఏది ఏమైనా.. క‌రోనా రోగి నుంచి డాక్ట‌ర్‌కు ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చే చాన్స్‌ను ఈ స్మార్ట్ స్టెత‌స్కోప్ చాలా వ‌ర‌కు త‌గ్గిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news