ఫేస్‌బుక్‌ కొత్త రియాక్షన్స్…!

-

కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ ని పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి అన్ని దేశాలు. దీనితో ఇంట్లో ఉండే వాళ్ళు ఎక్కువగా సోషల్ మీడియాలో సమయం గడుపుతున్నారు. ప్రతీ ఒక్కరు ఎక్కువగా సోషల్ మీడియాకు పరిమితం అవుతున్నారు. దీనితో సోషల్ మీడియా దిగ్గజాలు అన్నీ కూడా తమ వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించాలి అని నిర్ణయం తీసుకున్నాయి.

తాజాగా ఫేస్బుక్ వరుసగా రెండు కొత్త రియాక్షన్స్ ని ఫేస్బుక్ మరియు మెసెంజర్ యాప్స్ లో ప్రారంభించింది. ఫేస్బుక్ యాప్ మరియు వెబ్‌సైట్‌లో, వినియోగదారులు కేర్ రియాక్షన్ ని పంపే అవకాశం ఉంటుంది. ఇది హృదయాన్ని దాచుకునే అందమైన పాత్రలా కనిపిస్తుంది. ఈ రియాక్షన్ ప్రేమను పెంచే విధంగా ఉంటాయని ఫేస్బుక్ చెప్తుంది. క్లాసిక్ థంబ్స్-అప్, హార్ట్, లాఫర్, షాక్, విచారం మరియు కోపం వంటి రియాక్షన్స్ ని స్టార్ట్ చేసింది.

ప్రతీ పోస్ట్ లో వినియోగదారులు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. 2015 నుంచి రియాక్షన్స్ ని లైక్ సింబల్ తో పాటుగా ఉంచాయి. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో, ప్రస్తుతం ఉన్న ఆరు రియాక్షన్స్ తో పాటుగా ఏడవ రియాక్షన్‌ను ప్రారంభిస్తామని ఫేస్బుక్ తెలిపింది. కొత్త కేర్ రియాక్షన్ ప్రపంచవ్యాప్తంగా వచ్చే వారం ప్రారంభమవుతుందని… యాప్ లో పోస్ట్‌లు, కామెంట్స్, ఫోటోల మీద, వీడియోలకు దీన్ని వాడుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news