గూగుల్‌ మాప్స్‌లో సరికొత్త ఫీచర్లు!

-

గూగుల్‌ మ్యాప్స్‌ వినియోగదారులకు శుభవార్త. ఇకపై మీరూ గూగుల్‌ మ్యాప్లని ఎడిట్‌ కూడా చేయవచ్చు. మ్యాప్‌లో ఏవైనా తప్పుగా నమోదైన రోడ్లు, మిస్‌ అయిన రోడ్ల వివరాలను సులభంగా ఎడిట్‌ చేసే అవకాశాన్ని గూగుల్‌ మ్యాప్‌ కల్పిస్తోంది. దీని పనితీరును మెరుగుపరిచేందుకు వినియోగదారులకు భాగస్వామ్యం చేయాలని సంస్థ భావిస్తోంది.

 

దీనికి తగ్గట్లు కొత్త ఫీచర్లను అభివృద్ధి చేస్తోంది. ఎడిటింగ్‌ ఫీచర్‌ను గూగుల్‌ drawing పేరుతో త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే లొకేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలిపే photo update. ఈ కొత్త అప్‌డేట్లు త్వరలో 80 దేశాల్లో విడుదల కానున్నాయి. మ్యాప్స్‌ ఎడిటింగ్‌ ఫీచర్‌ను వినియోగదారులు పరిమితంగానే యాక్సెస్‌ చేసే అవకాశం ఉంది. మిస్‌ అయిన, కొత్త రోడ్ల వివరాలను నమోదు చేయడానికి మ్యాప్స్‌లో సంబంధిత ప్రాంతాన్ని పిన్‌ చేయాలి. ఈ మార్పులకు సంబంధించి గూగుల్‌ అడిగే పూర్తి సమాచారాన్ని కూడా అందివ్వాలి. ఇప్పటి వరకు వినియోగదారులు కేవలం గూగుల్‌కు రిపోర్ట్‌ చేసే అవకాశం మాత్రమే ఉంది. కానీ ఈ కొత్త అప్‌డేట్‌తో నేరుగా వినియోగదారులు ఎడిట్‌ చేసే అవకాశం కల్పించింది గూగుల్‌.

డ్రాయింగ్‌ ఫీచర్‌ను ఉపయోగించడానికి యాప్‌ మెనూ బటన్‌ లో కనిపించే edit the map ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తరువాత తప్పుగా నమోదైన, కొత్త రోడ్ల వివరాలను అప్‌లోడ్‌ చేయవచ్చు. మార్పులను ఎడిట్‌ చేసి సబ్మిట్‌ చేసే ముందు గూగుల్‌ ఒక వార్నింగ్‌ నోటిఫికేషన్‌ పంపిస్తుంది. సూచించిన మార్పుల్లో కేవలం బైక్స్‌ వెళ్లే మార్గాలను రోడ్డుగా గుర్తించవద్దని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా సూచనలు ఉండకూడదని నోటిఫికేన్‌లో కనిపిస్తుంది. వినియోగదారులు చేసిన సూచనలను గూగుల్‌ వారం రోజుల్లో రివ్యూ చేస్తుంది. డ్రాయింగ్‌ ఫీచర్‌తో పాటు ఫోటో అప్‌డేట్‌ అనే కొత్త ఫీచర్‌ను కూడా గూగుల్‌ విడుదల చేయనుంది. ఏదైనా ఒక ప్రదేశం గురించి పూర్తి వివరాలను రివ్యూలో రాయడానికి బదులుగా ఎక్కువ ఫోటోలను అప్‌లోడ్‌ చేయవచ్చు. ఒక లొకేన్‌ కు సంబంధించి ఇతరులు సబ్మిట్‌ చేసిన తాజా ఫోటోలను చూడవచ్చు. దీని ద్వారా చిన్నపాటి వివరాలను సైతం వినియోగదారులు తెలుసుకోవచ్చని గూగుల్‌ తెలిపింది. వినియోగదారులకు సంబంధించిన సొంత లొకేషన్‌ వివరాలను కూడా సులభంగా అప్‌డేట్‌ చేయవచ్చు. దీనికి upload a photo update ను ఎంచుకోవాలి. ఫోటోలను అప్‌లోడ్‌ చేసి, కొద్దిపాటి వివరాలు రాస్తే సరిపోతుంది. అప్పుడు లొకేషన్‌ వివరాలు అప్‌డేట్‌ అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news