భారతదేశపు మొట్టమొదటి ఇంటర్నెట్ కార్ ఎమ్ జీ హెక్టార్ 2021.. దాని ప్రత్యేకతలివే..

-

ఎమ్ జీ.. మోరీస్ గ్యారేజ్.. 1924లో స్థాపించబడిన కార్ల ఉత్పత్తి సంస్థ. అప్పటి నుండీ ఇప్పటి వరకూ అత్యుత్తమ కార్లని అందించడంలో ముందుంది. ప్రస్తుతం ఎమ్ జీ నుండి హెక్టార్ 2021 అనే సరికొత్త ఇంటర్నెట్ కారు వచ్చేసింది. భారత దేశంలోనే మొట్టమొదటి ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఎస్ యూ వీ కారు ఇది. డ్యుయల్ టోన్ ఎక్స్ టీరియర్స్, ఇంటీరియర్స్ కలిగి ఉండ్, 5, 6, 7సీట్ల అందుబాటులో లాంచ్ అయ్యింది. విలాస వంతమైన షాంపైన్, బ్లాక్ డ్యుయల్ టోన్ మిశ్రమాలు సహా, హింగ్లీష్ వాయిస్ కమాండ్స్, ఐ స్మార్ట్ సాంకేతికత దీని సొంతం.

హెక్టార్ 2021 5సీటర్ ధర 12.89 లక్షలుగా ఉంది. ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్ లెస్ ఛార్జింగ్, ఆటో డిమ్మింగ్, ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ ప్రత్యేకతలుగా ఉంది.

హెక్టార్ 2021 7సీటర్ ధర 13.34 లక్షల నుండి ప్రారంభం. సన్ రూఫ్ కలిగి ఉండి, ముగ్గురు పెద్దలకు రెండు వరుస సీట్లు, ఇద్దరు పిల్లలకు కావాల్సిన సీట్లు కలిగి హింగ్లీష్ వాయిస్ కమాండ్ల సాంకేతికత సొంతంగా ఉంది.

కెప్టెన్ సీట్లతో హెక్టార్ 2021 ధర 15.99లక్షలతో ప్రారంభం. వెంటిలేటెడ్ సీట్లు, వైర్ లెస్ చార్జింగ్, ఆటోడిమ్మింగ్, ఐఆర్ వీ ఎమ్ తో కొత్తగా రూపొందించారు.

ఐస్మార్ట్

సన్ రూఫ్ తెరుచుకోవడానికి ఖుల్జా సిమ్ సిమ్ అనే కమాండ్లు ఇస్తే చాలు. అలాగే, ఎఫ్ ఎమ్ ఆన్ చేయమనడానికి ఎఫ్ ఆన్ కరో, ఏసీ( టెంపరేఛర్ కమ్ కర్ దో) వంటి వాయిస్ కమాండ్లు ఉన్నాయి.

ఆక్యువెదర్ ద్వారా వాతావరన సూచన, గానా యాప్ లో సెర్చ్ చేయడానికి వాయిస్ సెర్చ్, వైఫై కనెక్టివిటీ సహా 60కి పైగా అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉంది.

48ఓల్టుల మైల్డ్ హైబ్రిడ్ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ, ట్రాక్షన్ కంట్రోల్ రియర్ వైపర్, వాషర్ సహా అనేక భద్రతా లక్షణాలను కలిగి ఉంది. ఎమ్ జీ కార్, ఇప్పటి వరకు 40వేలకి పైగా యూనిట్లని రిటైల్ చేసింది. 65నగరాల్లో 250కి పైగా టచ్ పాయింట్లతో మంచి ఊపందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news