సరికొత్త ఫీచర్స్ ని తీసుకొచ్చిన ఇంస్టాగ్రామ్..!

-

ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ కి బాగా అలవాటు పడిపోయారు. పైగా చాలా మంది పాపులర్ యాప్స్ తో బిజీ అయిపోతున్నారు. అయితే బాగా ప్రసిద్ధి చెందిన యాప్స్ లో ఇంస్టాగ్రామ్ కూడా ఒకటి. ఇంస్టాగ్రామ్ రోజు రోజుకి కొత్త ఫీచర్లను తీసుకు వస్తోంది.

ఇన్‌స్ట్రాగామ్‌ | Instagram
ఇన్‌స్ట్రాగామ్‌ | Instagram

 

యూజర్లకి ఇవి బాగా నచ్చుతాయి కూడా తాజాగా యూజర్ల కోసం కొత్త ఫీచర్లను తీసుకు వచ్చింది ఇంస్టాగ్రామ్. మరి ఇంక ఆ ఫీచర్ల గురించి ఒక లుక్ వేసేద్దాం.

రిప్లై వైల్ యు బ్రౌజ్:

ఇంస్టాగ్రామ్ లో వచ్చిన ఈ ఫీచర్ బాగా ఉండేటట్టు కనబడుతోంది. మనం ఇంస్టాగ్రామ్ లో ఏదైనా బ్రౌజ్ చేస్తున్న సమయంలో ఎవరైనా మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడానికి మనం ప్రత్యేకించి ఇన్ బాక్స్ లోకి వెళ్లక్కర్లేదు డైరెక్ట్ గా మెసేజ్ ఓపెన్ చేసి రిప్లై చేయొచ్చు.

ఎవరు ఆన్లైన్లో ఉన్నారో చూడటం:

ఈ ఫీచర్ తో మనం యాప్ ఓపెన్ చేశాక ఎంత మంది ఎవరెవరు ఆన్లైన్లో ఉన్నారు అనేది చూడొచ్చు.

ప్లే పాస్ మరియు రీ ప్లే:

మ్యూజిక్ స్ట్రీమింగ్ సౌకర్యాలను ఎనేబుల్ చేసుకునేలా ఇంస్టాగ్రామ్ ఈ ఫీచర్ను తీసుకురానుంది. ఈ ఫీచర్ సహాయంతో చాట్ లో 30 సెకన్లలో ఉన్న పాటల్ని ఇతరులతో మనం షేర్ చేసుకోచ్చు.

సెండ్ సైలెంట్ మెసేజెస్:

మీరు ఇంస్టాగ్రామ్ లో ఎవరికైనా మెసేజ్ పంపే ముందు ఎట్ ద రేట్ ఆఫ్ సైలెంట్ అని టైప్ చేస్తే మెసేజ్ నోటిఫికేషన్ సైలెంట్ గా అవతలి వ్యక్తికి వెళుతుంది ఇలా ఇంస్టాగ్రామ్ ఈ కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news