కేటీఆర్‌ ఏపీని అనలేదు..లోకేష్‌ వక్రీకరించారు – రోజా

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయల్లో హాట్‌ టాపిక్‌ గా మారాయి. ఏపీ మంత్రులు కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. వరుసగా వైసీపీ నేతలు కేటీఆర్‌ పై దాడి చేస్తున్నారు.  అయితే.. తాజాగా మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మరోసారి మంత్రి రోజా స్పందించారు. కేటీఆర్‌ ఏపీని అనలేదు..లోకేష్‌ కావాలనే వక్రీకరించారని మంత్రి రోజా అన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న బురదజల్లుడు కార్యక్రమాలన్నింటి వెనుక టీడీపీ వుందని ఫైర్‌ అయ్యారు. పేపర్ లీక్ అంశంలో కూడా ఆ పార్టీవారే అరెస్ట్ అవుతున్నారని పేర్కొన్నారు. దిశ స్పూర్తితో రమ్య కేసులో నిందితులకు శిక్ష పడిందని స్ఫష్టం చేశారు. కేటీఅర్ వ్యాఖ్యలను మీడియా , నారా లోకేష్ వక్రీకరించారు. ఆయన ప్రక్క రాష్ట్రాలు అన్నారు గాని , ఆంధ్రప్రదేశ్ అని అనలేదని క్లారిటీ ఇచ్చారు మంత్రి రోజా. కావాలనే టీడీపీ, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news