ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌.. మెమోరియలైజేషన్

-

ఫేస్బుక్ కి చెందిన ఇన్‌స్టాగ్రామ్ కీలక ఫీచర్ ని యాడ్ చెయ్యాలని భావిస్తుంది. అకౌంట్ మెమోరియలైజేషన్ ఫీచర్‌ను ప్రారంభించాలని ఆ సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీనితో ఇక నుంచి సోషల్ మీడియాలో చురుకుగా లేని ఖాతాలను హైలెట్ చెయ్యాలని భావిస్తున్నారు. ఒక వ్యక్తి మరణిస్తే అతని అకౌంట్ అలాగే ఉండిపోతుంది.

దీనితో మరణించిన వ్యక్తుల ఖాతాలను హైలెట్ చెయ్యాలి అని భావిస్తుంది. ఈ నేపధ్యంలోనే తన ప్లాట్‌ఫామ్‌లో అకౌంట్ మెమోరియలైజేషన్ ఫీచర్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది ఇన్‌స్టాగ్రామ్. ఈ ఫీచర్‌ను మొదట హాంగ్ కాంగ్‌కు చెందిన హ్యాకర్ జేన్ మంచున్ వాంగ్ గుర్తించారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ క్రింద అలాగే ఖాతా పేరు పైన ‘రిమెంబరింగ్’ బ్యానర్‌ను జోడించాలి అని భావిస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ ఫీచర్ ని తీసుకుని రావాలని సంస్థ ప్రయత్నాలు చేస్తుంది.

ఫేస్బుక్ ఇప్పటికే దీనిని ప్రవేశ పెట్టింది. కరోనా తర్వాత ఇన్‌స్టాగ్రామ్ దీనిపై ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. తాము కొంత కాలంగా దీనిపై పని చేస్తున్నామని… కరోనా సమయంలో దీనిని మరింత వేగవంతం చేసామని… ఒక ప్రకటన చేసింది ఈ సంస్థ. మరణించిన యూజర్ ప్రొఫైల్‌ను ఓపెన్ చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ టెక్స్ట్‌తో పాప్-అప్‌ను చూపిస్తుంది. ఆ ఖాతాను జీవితం మొత్తం ఉంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపింది. అయితే ఇది ఫాలో అయ్యే వారికి మాత్రమే కనిపిస్తుంది. నెల రోజుల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news