గూగుల్‌ మిమ్మల్ని ట్రాక్‌ చేస్తుందని అనుమానమా?

-

మీరు స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లైతే మిమ్మల్ని గూగుల్‌ ట్రాక్‌ చేస్తుందని అనుమానమా? కానీ, మీకు సంబంధించిన డేటాను గూగుల్‌ ఏం చేస్తుంది? దీనికి గూగుల్‌ ఏ సమాధానం ఇచ్చిందో తెలుసుకోండి! కొన్నేళ్లుగా ప్రజల గోప్యత విషయంలో న్యాయవాదులు, కమ్యూనిటీలు ఈ అంశంపై బలంగా వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో వినియోగదారుల ప్రైవసీ విషయంలో గూగుల్‌ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఫేస్‌ బుక్, గూగుల్‌ లాంటి దిగ్గజ సంస్థలు ఇష్టానుసారంగా వినియోగదారుల సమాచారాన్ని సేకరిస్తున్నాయి. యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీ కోసం గూగుల్‌ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్‌ యూజర్ల టోగుల్, థర్డ్‌ పార్టీ గూగుల్‌ ట్రాకింగ్‌ వంటి కంట్రోల్స్‌ను ప్రవేశపెట్టింది. గూగుల్‌.. ప్రైవసీ కమ్యూనిటీల పరంగా కొన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే యాంటీ కాంపీటిషన్‌ దర్యాప్తు పెండింగులో ఉంది. ఈనేపథ్యంలో వారికి తరచూ ఉత్పన్నమవుతున్న ప్రశ్నలకు సమాధానాలను ప్రచూరించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

గూగుల్ / google
గూగుల్ / google

సాధారణంగా గూగుల్‌ యాక్టీవ్‌ అయ్యేవరకు స్టాండ్‌ బై మోడ్‌లో ఉంటుంది. దీన్ని స్టార్ట్‌ చేయడానికి మీరు ఓకే గూగుల్‌ అనాల్సిందే. అప్పుడు చిన్న స్నిప్పెట్లను ప్రాసెస్‌ చేస్తుంది. కేవలం యాక్టివ్‌ను కనుగొన్నప్పుడు మీ రిక్వెస్ట్‌ ను తీర్చడానికి గూగుల్‌ అసిస్టెంట్‌ స్టాండ్‌ బై మోడ్‌ నుంచి బయటకు వస్తుంది. మీ యాక్టివిటీని డిలీట్‌ చేయడం కూడా చాలా ఈజీ. ’హే గూగుల్‌ డిలీట్‌ దిస్‌ వీక్‌ యాక్టివిటీ’ ద్వారా యాక్టివిటీని డిలీట్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ ఉత్పత్తుల్లో యాక్టివిటీని రివ్యూ చేయడానికి, తొలగించడానికి మీరు ఈ పేజీని ఉపయోగించవచ్చు

గతంలో మీరు చేసిన సెర్చ్‌లు, సందర్శించిన వెబ్‌ సైట్లు, క్లిక్‌ చేసిన ప్రకటనల ఆధారంగా మీకు యాడ్స్‌ కనిపిస్తాయి. ’వై దిస్‌ యాడ్‌’ ఫీచర్‌ ద్వారా మీకు ఇచ్చిన ప్రకటన గురించి తెలుసుకోవచ్చు. ప్రకటనలు మీకు మరింత ఉపయోగకరంగా ఉండటానికి డేటా మీకు సహాయపడుతుంది. యాడ్‌ సెట్టింగ్స్‌ పేజీని సందర్శించి పర్సనలైజ్‌ యాడ్స్‌ పూర్తిగా నిలిపివేయవచ్చు. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరికీ విక్రయించమని గూగుల్‌ చెబుతోంది. మీతో పాటు ప్రతి ఒక్కరికి మా సేవలను మెరుగుపరచడానికి సమాచారాన్ని ఉపయోగిస్తామని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news