విడుదలైన Acer Aspire 5 ల్యాప్‌టాప్.. గేమింగ్‌ లవర్స్‌కు బెస్ట్‌ ఛాయిస్‌..!

-

ఏసర్‌ నుంచి తాజాగా తన కొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. Acer Aspire 5 పేరుతో ఈ ల్యాప్‌టాప్‌ విడులైంది. ఇది ఒక గేమింగ్‌ ల్యాప్‌టాప్..ధర 50వేలు పైనే ఉంది. ల్యాప్‌టాప్‌ ఫీచర్స్‌ ఇలా ఉన్నాయి…

Acer Aspire 5 ధర..

ఈ ల్యాప్‌టాప్‌ ప్రారంభ ధర రూ. 62,990 ఉంది. Amazon India లేదా Acer యొక్క ఏదైనా ఆఫ్‌లైన్ స్టోర్, క్రోమా అవుట్‌లెట్‌ల ద్వారా ఇది కొనుగోలు చేయవచ్చు.

ఇంకా ఈ ల్యాప్‌టాప్‌లో ఎలాంటి ఫీచర్లు..

15.6 అంగుళాల ఫుల్ HD IPS LCD డిస్‌ప్లే అందించారు. దీని స్క్రీన్ 81.18 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, ఏసర్ కలర్ ఇంటెలిజెన్స్, ఏసర్ బ్లూలైట్‌షీల్డ్‌ వంటి క్వాలిటీస్ ఉన్నాయి.
8 GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో ఇది పనిచేస్తుంది. దీనిని 2TB వరకు డ్యూయల్ SSDలకు విస్తరించవచ్చు.
Intel కోర్ i5 12వ-తరం ప్రాసెసర్‌పై నడుస్తుంది.
Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ అందించారు.
బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ తగ్గించే Acer PurifiedVoice కూడా ఇందులో ఉంది.
720p HD వెబ్‌క్యామ్,ఫింగర్ ప్రింట్ స్కానర్‌ అందించారు.
కనెక్టివిటీ కోసం Wi-Fi 6E, బ్లూటూత్ 5.2, మూడు USB టైప్-A పోర్ట్‌లు, ఒక HDMI 2.0 పోర్ట్‌, Thunderbolt 4 పోర్ట్‌ ఉన్నాయి.
ల్యాప్‌టాప్‌లో ఎర్గోనామిక్ డిజైన్, మెటల్ టాప్ కవర్, ఎలివేటింగ్ కీలు ఉన్నాయి.
ఈ ల్యాప్‌టాప్ 12వ తరం Intel కోర్ i5 ప్రాసెసర్ ఆధారంగా Nvidia GeForce RTX 2050 GPU ద్వారా శక్తిని పొందుతుంది.
హీట్ పెరగకుండా ఇది డ్యూయల్ ఫ్యాన్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.
అదనంగా ఇందులో వివిధ కూలింగ్ మోడ్‌లు, డ్యూయల్-కాపర్ థర్మల్ పైపర్‌లు ఉన్నాయి.
ఇవి ఎయిర్ ఇన్‌లెట్ కీబోర్డ్‌ నుంచి 10 శాతం వేడిని బయటకు పంపిస్తాయి.

ప్రముఖ బ్రాండ్‌ ల్యాప్‌టాప్స్‌కు ఈ ల్యాప్‌టాప్‌ మంచి పోటీ ఇస్తుందని టెక్‌ నిపుణుల అంచనా.. కొత్తగా ల్యాప్‌టాప్‌ కొనేవాళ్లు..ఎప్పుడే చూసేవే కాకుండా..ఫీచర్స్‌ ఎక్కువ ఉన్నవి తీసుకోవాలనుకుంటే..ఈ ల్యాప్‌టాప్‌ పై ఓ లుక్కేయండి.!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news