శుద్ధి యంత్రం యొక్క పని తీరు చూద్దామా

-

చెరువుల్లో పేరుకుపోయిన చెత్త, దట్టంగా మొలుస్తున్న గుర్రపు డెక్క ను తొలిగించేందుకు పారిశుద్ధ్య కార్మికులు ప్రమాదాలకు గురి కావడమే కాకుండా,  ఇబ్బందులు పడుతుండడం చూసిన ఆయా నగరాల పురపాలక కార్పొరేషన్ లు అధునాతన సాంకేతికతో నిర్మాణమైన ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్లు(FTC) కొనుగోలు చేస్తున్నారు.

ఇంతకీ ఈ శుద్ధి యంత్రం ఎలా పనిచేస్తుందో ఒక సారి చూద్దాం.

. ఎఫ్.టీ. సీ చెరువుల్లో 12 మీటర్ల లోతుకు వెళ్లి పేరుకుపోయిన వ్యర్థాలు తీస్తాయి.
. చెరువుల్లో, కాల్వలలో సేకరించిన వ్యర్థాలను ఒడ్డున పడేస్తుంది.
. నీటి పై తేలే చెత్త, గుర్రపు డెక్కను వేళ్ళతో సహా పీకేస్తాయి.
. తేమ తగ్గగానే చెత్తతో కూడిన గుర్రపు డెక్కను పారిశుద్ధ్య కార్మికులు డంపింగ్ యార్డుకు తరలిస్తారు.
. అక్కడ గుర్రపు డెక్కను వేరు చేసి ఎరువుగా మార్చుతారు.
 మార్కెట్ లో ఈ యంత్రం ఖరీదు 1.3 కోట్ల రూపాయలు నుండి 1.5 కోట్ల రూపాయలు ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఉన్న 185 చెరువుల్లో పేరుకుపోయిన చెత్తను, గుర్రపు డెక్కను తొలిగించేందుకు జీహెచ్ ఎంసి అధికారులు కొనుగోలు చేసి ఉంచారు. త్వరలో ఈ యంత్రాలను ఉపయోగించి చెరువులను శుద్ధి చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news