ఎల్‌జీకి చెందిన ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. రూ.40వేలు త‌గ్గింది..!

-

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు ఎల్‌జీ ఇటీవ‌లే స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. భారీ న‌ష్టాలు వ‌స్తున్నందునే ఇక‌పై స్మార్ట్ ఫోన్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌బోమ‌ని ఎల్‌జీ స్ప‌ష్టం చేసింది. అయితే ఎల్‌జీ ఆ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసినప్ప‌టి నుంచి ఆ కంపెనీకి చెందిన ఫోన్లను భారీ డిస్కౌంట్ ల‌తో విక్ర‌యిస్తున్నారు. అందులో భాగంగానే ఎల్‌జీకి చెందిన వింగ్ అనే స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.69,990 ఉండ‌గా దానిపై ఏకంగా రూ.40వేల భారీ డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.29,990 ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఏప్రిల్ 13వ తేదీ నుంచి ఈ ధ‌ర‌కు ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నారు.

lg giving rs 40000 massive discount on this smart phone

ఇక ఈ ఫోన్‌పై 1 ఏడాది వారంటీ ల‌భిస్తుంది. 5 ఏళ్ల వ‌ర‌కు స‌ర్వీస్‌ను అందిస్తారు. ఈ వివ‌రాల‌ను ఫ్లిప్‌కార్ట్‌లో చూడ‌వ‌చ్చు. స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి త‌ప్పుకున్నా ఆ ఫోన్ల‌కు ఇంకొన్ని ఏళ్ల పాటు స‌ర్వీస్‌ను మాత్రం ఎల్‌జీ అందివ్వ‌నుంది. ఇక ఇటీవ‌లే ఎల్‌జీ జీ8ఎక్స్ అనే ఫోన్‌పై కూడా ఎల్‌జీ ఇలాగే భారీ డిస్కౌంట్‌ను ఇచ్చింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి త‌ప్పుకుంది క‌నుక పెద్ద ఎత్తున ఉన్న ఫోన్ల స్టాక్‌ను క్లియ‌ర్ చేయాల‌ని ఎల్‌జీ భావిస్తోంది. అందులో భాగంగానే ఇంత‌టి భారీ డిస్కౌంట్ల‌కు ఎల్‌జీ ఫోన్ల‌ను విక్ర‌యిస్తోంది.

కాగా ఎల్‌జీ వింగ్ స్మార్ట్ ఫోన్‌లో 6.8 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన మెయిన్ డిస్‌ప్లే ఉంది. 3.9 ఇంచుల సెకండ్ డిస్‌ప్లేను కూడా ఇందులో ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 765జి ప్రాసెస‌ర్‌, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 2టీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌, 64, 13, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ పాప‌ప్ ఫ్రంట్ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, మిలిట‌రీ గ్రేడ్ నాణ్య‌త‌, వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news