పాస్‌వ‌ర్డ్ మ‌ర్చిపోయాను, స‌హాయం చేయండి.. గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్‌కు వ్య‌క్తి ట్వీట్‌..

సాధార‌ణంగా మ‌నం జీమెయిల్‌కు చెందిన పాస్‌వ‌ర్డ్‌ను మ‌ర్చిపోతే ఏం చేస్తాం ? సెకండ‌రీ ఈ-మెయిల్ లేదా ఫోన్ నంబ‌ర్‌, సెక్యూరిటీ ప్ర‌శ్న‌ల స‌హాయంతో పాస్‌వ‌ర్డ్‌ను రీసెట్ చేస్తాం. కొత్త పాస్‌వ‌ర్డ్‌ను పెట్టుకుంటాం. అయితే ఈ మార్గాలు ఏవీ సాధ్యం కాక‌పోతే ఇక జీమెయిల్‌కు తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందే. కొత్త మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ వ్య‌క్తి మాత్రం ఏకంగా గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్‌కే ఈ విష‌య‌మై ట్వీట్ చేశాడు.

man asked google ceo sunder pichai to help him reset his gmail password

మాధ‌న్ అనే వ్య‌క్తి త‌న జీమెయిల్ పాస్‌వ‌ర్డ్ మర్చిపోయాన‌ని, రీసెట్ చేసేందుకు స‌హాయం చేయాల‌ని గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్‌కు ట్వీట్ చేశాడు. భార‌త్‌లో కోవిడ్ ఉధృతి నేప‌థ్యంలో గూగుల్ రూ.135 కోట్లు స‌హాయం అందిస్తుంద‌ని పిచాయ్ ట్వీట్ చేయ‌గా, మాధ‌న్ ఆ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ పైన తెలిపిన విధంగా స‌హాయం అడిగాడు.

అయితే అందుకు పిచాయ్ స్పందించ‌లేదు. కానీ మాధ‌న్ పెట్టిన పోస్టు మాత్రం వైర‌ల్ అయింది. నెటిజ‌న్లు దీనికి ఫన్నీగా స్పందిస్తున్నారు. ప్ర‌స్తుతం కోవిడ్ ఉంది క‌దా, దాని ప్ర‌భావం త‌గ్గాక పిచాయ్ హెల్ప్ చేస్తారులే అని చాలా మంది కామెంట్లు చేశారు. ఇక గూగుల్ మాత్ర‌మే కాదు, అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీలు ప్ర‌స్తుతం భార‌త్‌కు స‌హాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్నాయి.