8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో IQoo U5X ఫోన్.. ధర 13 వేలలోనే.!

-

తక్కువ బడ్జెట్ లో స్మార్ ఫోన్ కొనాలకునే వారికి.. ఐకూ కూడా ఒక మంచి ఎంపికే.. ఐకూ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఈ బడ్జెట్ 4జీ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను అందించారు. ఈరోజు ఈ ఫోన్ రివ్యూ చూసేద్దామా..!
ఐకూ యూ5ఎక్స్ ధర :
చైనాలో ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ చేశారు. . వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 899 యువాన్లుగా అంటే సుమారు రూ.10,700 ఉంది.
ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధరను 1,099 యువాన్లుగా అంటే సుమారు రూ.13,100 నిర్ణయించారు.
ఐకూ యూ5ఎక్స్ హెలెట్స్: 
ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ ఉంది.. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది.
ఐకూ యూ5ఎక్స్‌లో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇచ్చారు.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు..
పాలీ కార్బనేట్ బాడీతో ఈ స్మార్ట్ ఫోన్‌ను రూపొందించారు. పవర్ బటన్‌ను ఫోన్ కుడివైపు అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులోనే ఉంటుంది.
ఐకూ యూ5ఎక్స్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 25.8 రోజుల బ్యాటరీని ఇది అందించనుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 10 గంటల పాటు ఇందులో నాన్ స్టాప్‌గా గేమింగ్ చేయవచ్చని కంపెనీ చెప్తోంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో మైక్రో యూఎస్‌బీ పోర్టును అమర్చారు.. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news