Official: “రాధేశ్యామ్” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

-

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, మోస్ట్ స‌క్సస్ ఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే క‌లిసి చేసిన రాధే శ్యామ్. ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో ఈ నెల 11 వ తేదీన పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల అయింది. కాగ ఈ సినిమా విడుద‌లై నిన్న‌టితో వారం రోజ‌లు కావాస్తుంది. ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో విడుద‌ల అయింది. కాగ అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో కొంత వ‌ర‌కు విఫ‌లం అయింద‌ని సినీ విమ‌ర్శ‌కులు, అభిమానులు అంటున్నారు.

ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా… స్టోరీ ఉండకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇది ఇలా ఉండగా ప్రభాస్ ఫ్యాన్స్ కు.. ఈ చిత్రబృందం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాధేశ్యామ్ సినిమాను ఓ టి టి లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీన ఉగాది కానుకగా రాధేశ్యామ్ సినిమాను ఓ టి టిలో రిలీజ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది చిత్రబృందం. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ అప్డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news