చైనాలో లాంచ్‌ అయిన రెడ్‌మీ నోట్‌ 12 స్మార్ట్‌ ఫోన్..!!

-

రెడ్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ చైనాలో లాంచ్‌ అయింది. అదే రెడ్‌మీ నోట్‌ 12. షావోమీ లాంచ్ చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇది.. ఇందులో శాంసంగ్ డిస్‌ప్లేను అందించడం హైలెట్‌..ఈ ఫోన్ ఇంకా మనదేశంలో లాంచ్ కాలేదు. త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

రెడ్‌మీ నోట్ 12 ధర..

ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,199 యువాన్లుగా అంటే సుమారు రూ.13,600గా నిర్ణయించారు.
ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,299 యువాన్లుగా అంటే సుమారు రూ.14,600గా ఉంది.
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 యువాన్లుగా అంటే సుమారు రూ.17,000లో ఉంది.
మిడ్‌నైట్ డార్క్, టైమ్ బ్లూ, మిర్రర్ పోర్స్‌లెయిన్ వైట్ ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మీ నోట్ 12 స్పెసిఫికేషన్లు..

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై రెడ్‌మీ నోట్ 12 పని చేయనుంది. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ శాంసంగ్ డిస్‌ప్లేను అందించారు. రెడ్‌మీ నోట్ 12 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌పై రెడ్‌మీ నోట్ 12 పని చేయనుంది.
8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే…

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news