యాపిల్ కంపెనీకి షాక్.. వేడెక్కుతున్న ఐఫోన్‌ 15 ఫోన్లు.. ఫిర్యాదుల వెల్లువ

-

భారత్ మార్కెట్​లో విడుదలైన ఐఫోన్15 సిరీస్ ఫోన్లను టెక్ లవర్స్ ఎగబడి కొనుగోలు చేశారు. ఆ ఫోన్ల కోసం తెల్లవారుజామునే ఐఫోన్ కేర్ ముందు బారులు తీరారు. తీరా మొబైల్ కొన్నాక తెలిసింది దాని అసలు కథ. రోజుకో సమస్యతో ఐఫోన్ ప్రియులు కష్టపడుతున్నారు. ఈ మొబైల్స్ ఇప్పుడు విపరీతంగా హీట్ జెనరేట్ చేస్తున్నట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ఐఫోన్‌ 15 ప్రో ( iPhone 15 Pro), ఐఫోన్‌ 15 ప్రో మాక్స్‌ ( 15 Pro Max ) ఫోన్లు కాసేపు ఛార్జింగ్‌ పెట్టినా, మాట్లాడినా, ఏదైనా గేమ్స్‌, వీడియో ఛాట్‌ ఇలా దేనికోసం మొబైల్ వాడినా వెంటనే హీట్ ఎక్కుతోందని యూజర్స్ చెబుతున్నారు. ఫోన్ వెనకభాగం.. టచ్​ భాగాన్ని ముట్టుకోలేక పోతున్నట్లు తెలిపారు. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ సమస్య మరింత తీవ్రమవుతోందని అంటున్నారు. ఈ విషయంలో ఐఫోన్ యూజర్స్ యాపిల్ సంస్థకు ఫిర్యాదు చేస్తున్నారు.

అయితే ఇలాంటి సమస్య ఎదురైనపుడు ఏం చేయాలనే విషయంపై గతంలోనే యాపిల్ కంపెనీ పలు సూచనలు చేసింది. తాజా సమస్యకు ఆ సూచనలు ఫాలో కావాలని చెబుతోందట ఆ కంపెనీ. ఇంటెన్సివ్ యాప్​లను వాడుతున్నపుడు, ఛార్జింగ్ పెట్టినపుడు, ఫస్ట్ టైం సెట్టింగ్ చేస్తున్నపుడు ఈ సమస్య ఎదురవుతుందని యాపిల్ తన గైడ్​లైన్స్​లో చెప్పుకొచ్చిందట.

Read more RELATED
Recommended to you

Latest news