బడ్జెట్ లో Redmi 10A స్మార్ట్ ఫోన్.. రూ. 10వేలలో 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్

-

రెడ్‌మీలో ఎప్పటికప్పుడు కొత్త రకం ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. తాజాగా రెడ్‌మీ 10A స్మార్ట్ ఫోన్ ను చైనాలో లాంచ్ చేశారు. ఇది ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. లో బడ్జెట్ లో మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్ కొనాలనుకునేవారికి మంచి ఎంపికే.. ఈరోజు మనం ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్, కాస్ట్ చూద్దాం.

రెడ్‌మీ 10ఏ ధర :

ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 649 యువాన్లుగా (సుమారు రూ.7,740) ఉంది.

ఇక 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 799 యువాన్లుగా (సుమారు రూ.9,500) నిర్ణయించారు.

టాప్ ఎండ్ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 899 యువాన్లుగా (సుమారు రూ.10,700) ఉంది.

మూన్ లైట్ సిల్వర్, స్మోక్ బ్లూ, షాడో బ్లాక్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మీ 10ఏ హైలెట్స్ :

ఇందులో 6.53 అంగుళాల వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లేను అందించారు. దీని పీక్ బ్రైట్‌నెస్ 400 నిట్స్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంటుంది.

మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు.

స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనకవైపు అందించారు. దీని మందం 0.9 సెంటీమీటర్లు కాగా… బరువు 194 గ్రాములుగా ఉంది.

ఇక 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. పంచ్ హోల్ కటౌట్‌లో దీన్ని అందించారు.

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.

4జీ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, బైదు, మైక్రో యూఎస్‌బీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news