లాంచ్‌కు రెడీ అయిన Vivo X Fold S.. స్పెసిఫికేషన్స్‌ ఇవే..!

-

వీవో నుంచి రెండో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌కు రెడీ అవుతోంది. ఈ ఏడాది మొటట్లోనే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఎక్స్ ఫోల్డ్‌ను కంపెనీ లాంచ్‌ చేసింది. ఇప్పుడు దాని తర్వాతి వర్షన్‌గా వివో ఎక్స్ ఫోల్డ్ ఎస్‌ను లాంచ్‌కు సిద్ధం చేస్తోంది. ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పటికే లీక్‌ అయ్యాయ. లీకుల ఆధారంగా.. ఫోన్‌ ధర లక్ష పైనే ఉంటుందని అంచనా.. ఇంకా ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే..

Vivo X Fold S ధర..

వివో ప్రత్యర్థి బ్రాండ్ షావోమీ ఇటీవలే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి.
వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 8,999 యువాన్లుగా అంటే..సుమారు రూ.1,06,200గా ఉంది.
ఇక 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 9,999 యువాన్లుగానూ అంటే సుమారు రూ.1,18,000గా
12 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 11,999 యువాన్లుగానూ సుమారు రూ.1,41,600గా నిర్ణయించారు.

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ ఫోల్డ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
5జీని ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 8.02 అంగుళాల మెయిన్ ఎల్టీపీవో 2.0 ఫోల్డింగ్ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. స్క్రీన్ రిజల్యూషన్ 2,160×1,914 పిక్సెల్స్‌గా ఉంది.
అవుటర్ డిస్‌ప్లేగా 6.56 అంగుళాల ఈ5 అమోఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది.
ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉండనుంది.
బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు అందించారు.
ఈ ఫోన్ బరువు 262 గ్రాములుగా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే…

ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియోల కోసం.. ముందువైపు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా అందించారు. వెనకవైపు కెమెరా సెటప్‌ను సమాంతరంగా అందించారు. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అవుతుందా, ఎప్పుడు లాంచ్ కానుంది అనే వివరాలు తెలియరాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news