కొత్తగా పెళ్లయిందా..? ఏదైనా మంచి ప్రదేశానికి హనీమూన్ గా వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ హనీమూన్ డెస్టినేషన్స్. ఎంతో ప్రశాంతంగా మీరు మీ పార్టనర్ తో సమయాన్ని గడపడానికి అవుతుంది. అదే విధంగా ఎక్కువ ఖర్చు అవ్వదు అలానే వీసాలు కూడా అవసరం అవ్వవు. ఎంచక్కా మీరు మన భారతదేశంలోనే ఎంజాయ్ చేయొచ్చు. మరి ఆ హనీమూన్ డెస్టినేషన్స్ గురించి ఇప్పుడే చూసేద్దాం.
ఊటీ కొడైకెనాల్:
కొత్తగా పెళ్లైన జంట హనీమూన్ కి వెళ్ళాలి అనుకుంటే ఇవి చాలా బెస్ట్. తమిళనాడులోని ఊటీ, కొడైకెనాల్ ఎంతో అందంగా ఉంటాయి ఫ్యామిలీ ట్రిప్స్ కూడా వేసుకోవచ్చు. హనీమూన్ కి అయితే పర్ఫెక్ట్. చలికాలంలో అయితే ఈ ప్రాంతాలు మరింత బాగుంటాయి. అందమైన ప్రకృతి తో ఆకట్టుకుంటాయి.
గోవా:
హనీమూన్ కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు గోవా ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. బీచ్లే కాకుండా ప్రైవేట్ రిసార్ట్స్, విల్లాస్ కూడా ఇక్కడ ఉంటాయి అంతేకాకుండా చారిత్రక కట్టడాలు కూడా ఎంతో అందంగా ఉంటాయి. గోవాలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి కనుక వెంటనే మీరు
లగేజీ సర్దేసుకోండి.
కేరళ:
కేరళ కూడా ఎంతో అందంగా ఉంటుంది. ప్రకృతి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. హనీమూన్ కపుల్స్ కి కూడా ఇది ఎంతో బాగుంటుంది. మున్నార్ హిల్ స్టేషన్ తో పాటుగా త్రివేండ్రం అల్లెపీ కూడా బాగా ఆకట్టుకుంటాయి.
అండమాన్ నికోబార్:
హనీమూన్ కపుల్స్ కి ఇది కూడా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. మన భారత భూభాగంలోనే ఇది ఉన్నప్పటికీ క్రూయిస్ లేదా మనం విమానంలో వెళ్లాల్సి ఉంటుంది. హనీమూన్ కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది కూడా పర్ఫెక్ట్.
షిమ్లా మనాలి:
కులుమనాలి, షిమ్లా కూడా చాలా బాగుంటాయి. మంచు పర్వతాలు ఎత్తైన కొండలు లోయలతో పర్యాటకుల్ని ఆకట్టుకుంటుంది.
లడఖ్:
లడఖ్ కూడా హనీమూన్ జంటలకు ఎంతో బాగుంటుంది ఇంచక్కా ఎంజాయ్ చేయడానికి అవుతుంది. కొత్త అనుభూతిని ఇస్తుందిది.