రూ.3,999కే నాయిస్ క‌ల‌ర్‌ఫిట్ ప్రొ 3 స్మార్ట్ వాచ్‌.. ఫీచ‌ర్లు అదిరాయ్‌..!

Join Our Community
follow manalokam on social media

నాయిస్ కంపెనీ క‌ల‌ర్‌ఫిట్ ప్రొ 3 పేరిట ఓ నూత‌న స్మార్ట్ వాచ్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 1.55 ఇంచుల క‌ల‌ర్ టచ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 24 * 7 హార్ట్ రేట్ ట్రాకింగ్‌ను అందిస్తున్నారు. బ్ల‌డ్ ఆక్సిజ‌న్ (ఎస్పీవో2) సెన్సార్ కూడా ఉంది. 14 ర‌కాల స్పోర్ట్స్ మోడ్స్ ల‌భిస్తాయి. గూగుల్ ఫిట్‌కు ఆటోమేటిగ్గా డేటా సింక్ అవుతుంది.

Noise Colorfit Pro 3 smart watch launched

ఈ వాచ్‌కు వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. ఇందులో 210 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది. 10 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్ వ‌స్తుంది. దీనికి జీపీఎస్ స‌పోర్ట్ మాత్రం లేదు.

నాయిస్ క‌ల‌ర్‌ఫిట్ ప్రొ 3 ఫీచ‌ర్లు…

* 1.55 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 320 x 360 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* బ్లూటూత్ 5.0 క‌నెక్టివిటీ, ఐఓఎస్ 9 ప్ల‌స్‌, ఆండ్రాయిడ్ 4.4 ప్ల‌స్ డివైసెస్ కంపాట‌బిలిటీ
* క‌స్ట‌మైజ‌బుల్ వాచ్ ఫేసెస్‌, పాలీకార్బొనేట్ షెల్ విత్ సిలికాన్ స్ట్రాప్
* 14 ర‌కాల స్పోర్ట్స్ మోడ్స్‌, హార్ట్ రేట్ సెన్సార్‌, ఎస్‌పీవో2 సెన్సార్
* స్ట్రెస్ మానిట‌ర్‌, బ్రీత్ మోడ్, క్యాల‌రీ, స్టెప్ కౌంట‌ర్
* స్లీప్ మానిట‌ర్‌, ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్ అండ్ రిమైండ‌ర్
* వాట‌ర్, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, కాల్స్‌, టెక్ట్స్‌, యాప్ నోటిఫికేష‌న్స్‌
* టైమ‌ర్, స్టాప్‌వాచ్‌, ఫైండ్ మై ఫోన్‌, సెడెంట‌రీ అల‌ర్ట్స్
* వెద‌ర్ ఫోర్‌క్యాస్ట్‌, వేక్ జెస్చ‌ర్‌, డు నాట్ డిస్ట‌ర్బ్ మోడ్‌
* క్యాలెండ‌ర్ రిమైండ‌ర్‌, హ్యాండ్ వాష్ రిమైండ‌ర్‌, హైడ్రేష‌న్ రిమైండ‌ర్
* రిమోట్ మ్యూజిక్ కంట్రోల్‌, 210 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 10 రోజుల బ్యాట‌రీ బ్యాక‌ప్

నాయిస్ క‌ల‌ర్‌ఫిట్ ప్రొ 3 వాచ్ జెట్ బ్లాక్‌, జెట్ బ్లూ, స్మోక్ గ్రే, స్మోక్ గ్రీన్, రోజ్ పింక్, రోజ్ రెడ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ వాచ్ ధ‌ర రూ.5,999. కానీ లాంచింగ్ కింద దీన్ని రూ.3,999కే అమెజాన్‌లో, గోనాయిస్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఆఫ‌ర్ కేవ‌లం ఒక్క రోజు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది.

TOP STORIES

వనదేవతల జాతర.. మినీ మేడారం

సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తున్నారు. మండమేలిగే పండగ సందర్భంగా...