నోకియా నుంచి 3.4, 5.4 స్మార్ట్ ఫోన్లు.. ధ‌ర‌, ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

Join Our Community
follow manalokam on social media

హెచ్ఎండీ గ్లోబ‌ల్ కంపెనీ నోకియా 3.4, 5.4 పేరిట రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను భార‌త్ లో బుధ‌వారం విడుద‌ల చేసింది. వీటిల్లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. వీటి ధ‌ర‌లు కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం.

nokia 3.4 and 5.4 smart phones launched

నోకియా 3.4 ఫీచ‌ర్లు…

* 6.39 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 720 x 1560 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 460 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్
* 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10
* 13, 5, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
* డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి
* 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

నోకియా 5.4 ఫీచ‌ర్లు…

* 6.39 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 720 x 1560 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 662 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్
* 64జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10
* 48, 5, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి
* 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

నోకియా 3.4 స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.11,999 ఉండ‌గా ఈ ఫోన్‌ను ఫిబ్ర‌వ‌రి 20వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌, నోకియా ఆన్‌లైన్ స్టోర్‌ల‌లో విక్ర‌యించ‌నున్నారు.

నోకియా 5.4 స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.13,999 ఉండ‌గా, 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.15,499 గా ఉంది. ఈ ఫోన్‌ను ఫిబ్ర‌వ‌రి 17వ తేదీ నుంచి విక్ర‌యిస్తారు.

TOP STORIES

ఎంఆధార్‌ యాప్‌ తో 35 రకాల ఆధార్ సేవలు… వివరాలు ఇవే..!

మీ ఫోన్ లో ఎంఆధార్‌ యాప్ వుందా...? అయితే మంచిగా 35 రకాల ఆధార్ సేవలు వున్నాయి. సులువుగా ఉపయోగించుకోండి. దీని వలన మీకు సూపర్...