విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌పై వివాదం ముదురుతోంది. 2019లోనే పోస్కో సంస్థతో స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం రహస్య ఒప్పందం చేసుకోవడం ఇప్పుడు కొత్త దుమారం రేగుతోంది. స్టీల్‌ప్లాంట్ కార్మికుల ఆందోళనకు అధికార వైసీపీ మద్దతు ప్రకటించడంతో ఉద్యమం మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కోరారు.
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో వరస భేటీలు నిర్విహస్తున్నారు. నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కలిశారు. ఏపీలో ప్రస్తుత పరిణామాలను వివరించారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచించాలని కోరామని పవన్ చెప్పారు. అలానే వైసీపీ మనస్ఫూర్తిగా చేయాలనుకుంటే చాలా చేయవచ్చని పవన్ కల్యాణ్ పేర్కోన్నారు. వాళ్లు చేయకూడదనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరని ఆయన పేర్కోన్నారు. తాము ఢిల్లీ వరకూ వచ్చి విజ్ఞాపన ఇచ్చినప్పుడు… 22 మంది ఎంపీలున్న వైసీపీ చాలా చేయవచ్చని పవన చెప్పుకొచ్చారు.