అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ 5జి స్మార్ట్ ఫోన్‌..!

మొబైల్స్ త‌యారీదారు వ‌న్‌ప్ల‌స్ నార్డ్ (oneplus nord) సీఈ (కోర్ ఎడిష‌న్‌) 5జి స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 750జి ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. దీనివ‌ల్ల 5జి కి స‌పోర్ట్ ల‌భిస్తుంది.

ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను అందిస్తున్నారు. 2 ఏళ్ల వ‌ర‌కు ఆండ్రాయిడ్ అప్ డేట్స్ ల‌భిస్తాయి. వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడు మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ మోనో కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ల‌భిస్తుంది. దీని వల్ల ఈ ఫోన్‌ను 30 నిమిషాల్లోనే 0 నుంచి 70 శాతం వ‌ర‌కు చార్జింగ్ చేయ‌వ‌చ్చు.

వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ 5జి ఫీచ‌ర్లు

  • 6.43 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఫ్లుయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
  • 1080 x 2400 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 750జి ప్రాసెస‌ర్‌
  • 6/8/12 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 11, డ్యుయ‌ల్ సిమ్
  • 64, 8, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  • ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
  • బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
  • 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ 5జి స్మార్ట్ ఫోన్ బ్లూ వాయిడ్ విత్ మ్యాట్ ఫినిష్‌, చార్‌కోల్ ఇంక్ విత్ గ్లాసీ ఫినిష్‌, సిల్వ‌ర్ రే క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌,128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.22,999 ఉండ‌గా, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.24,999 గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధర రూ.27,999గా ఉంది. దీన్ని అమెజాన్‌తోపాటు వ‌న్‌ప్ల‌స్ ఆన్‌లైన్ స్టోర్‌, వ‌న్‌ప్ల‌స్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ల‌లో జూన్ 16 నుంచి విక్ర‌యించ‌నున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుల‌తో ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు.