ఆన్లైన్ చెల్లింపులు బాగా పెరిగాయట… ఏ యాప్ ని ఎక్కువ వాడుతున్నారంటే…!

-

కరోనా వైరస్ పుణ్యమా అని ఇప్పుడు జనాలకు ఆన్లైన్ తో అవసరాలు ఎక్కువగానే ఉన్నాయి. క్యాష్ చెల్లింపులు లేకపోవడం తో ఆన్లైన్ లోనే బదిలీలు అన్నీ చేస్తున్నారు. కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత దేశంలో ఆన్లైన్ చెల్లింపులు పెరిగాయని తాజాగా ఒకసర్వే వెల్లడించింది. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఈ సర్వే చేసింది. ఏమైనా చెల్లింపులు చేయాల్సి ఉంటే ఆన్‌లైన్‌ మార్గాన్నే ఎంచుకుంటున్నట్లు తెలిపింది సర్వే.

ఈ సర్వేలో దాదాపు 42,000 మంది పాల్గొని తమ అభిప్రాయలు తెలియజేసారు. కొనుగోలు చేయడానికి గాను గత మూడు వారాల నుంచి డిజిటల్ చెల్లింపులను ఎంచుకున్నామని 42 శాతం మంది చెప్పారు. ముఖ్యంగా నిత్యావసరాల కొనుగోళ్లు చెల్లింపులు, మొబైల్‌ రీఛార్జ్‌లను ఆన్‌లైన్‌ ద్వారా ఎక్కువగా చేసుకున్నామని వాళ్ళు వివరించారు. ఆన్‌లైన్‌ చెల్లింపుల నిమిత్తం పేటీఎం, గూగుల్‌ పే లాంటి యాప్స్ ని ఎక్కువగా వాడుతున్నారని పేర్కొన్నారు.

నిత్యావసరాలను విక్రయిస్తున్న ఇ-కామర్స్‌ సంస్థలు బాగా బలపడినట్టు సర్వే పేర్కొంది. నిత్యావసరాల ఆర్డర్లు మూడు రెట్లు పెరిగాయని వెల్లడైంది. మూడు వారాల్లో పేటీఎం యాప్‌ను 33 శాతం మంది వాడుకున్నారు. 14% మంది గూగుల్‌ పే యాప్‌ను, 4% మంది ఫోన్‌ పే, 10% మంది అమెజాన్‌ పే, 6% మంది బీమ్‌, 33 శాతం మంది ఇతర యాప్‌లను వినియోగించామని పేర్కొన్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది కొత్తగా ఆన్లైన్ చెల్లింపులు మొదలుపెట్టారట.

Read more RELATED
Recommended to you

Latest news