తెలంగాణాలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో ఇది నగరాలకు మాత్రమే పరిమితం చెయ్యాలని గ్రామ స్థాయిలోకి విస్తరించకుండా చర్యలు తీసుకోవాలి అని తెలంగాణా ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఈ నేపధ్యంలో గ్రామాలకు భారీగా నిధులు విడుదల చెయ్యాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీలకు రూ.308 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ఆర్ధిక సంఘం నిధులు విడుదల చేయకపోయినా సరే… గ్రామాల్లో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలు, పారిశుధ్య పనులు నిలిచిపోకుండా చూడటానికి గానూ నిధులను తక్షణమే విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. జనాభాతో సంబంధం లేకుండా ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.3 లక్షలు – రూ.7 లక్షల వరకు ఇవ్వాలని కేసీఆర్ భావించారు.
కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి ప్రతి నెల రూ.308 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కాని ఈ నిధులు రాబోయే రెండు నెలల్లో వచ్చే అవకాశం లేదు. జూన్ లో ఈ నిధులను కేంద్రం విడుదల చేస్తుంది అంటున్నారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చెయ్యాలని నిర్ణయం తీసుకుంది.