పేటీఎం యూజ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌.. ఇక‌పై పేటీఎంలో ఇన్‌స్టంట్ లోన్స్‌..

-

ప్ర‌ముఖ డిజిట‌ల్ వాలెట్ యాప్ పేటీఎం త‌న యూజర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక‌పై అందులో యూజ‌ర్ల‌కు ఇన్‌స్టంట్ లోన్స్ ఇవ్వ‌నున్నారు. ప్ర‌స్తుత త‌రుణంలో ఆర్‌బీఐ అనుమ‌తి లేకుండా అనేక యాప్‌లు రుణాలు ఇస్తూ చిక్కుల్లో ప‌డ్డాయి. అయితే ఈ మార్కెట్‌ను అందిపుచ్చుకునేందుకు పేటీఎం ఇన్‌స్టంట్ లోన్స్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది. దీంతో ఈ రంగంలో కూడా పేటీఎం ఆదాయం ఆర్జించాల‌ని భావిస్తోంది.

paytm to give instant loans to its users

ఇక పేటీఎం ఇప్ప‌టికే ఇన్‌స్టంట్ లోన్స్‌ను బీటా ద‌శ‌లో పైల‌ట్ ప్రాజెక్టు కింద ప‌లువురికి ఇచ్చింది. అది స‌క్సెస్ అయ్యింది. దీంతో త్వ‌ర‌లోనే అందులో యూజ‌ర్లంద‌రికీ ఇన్‌స్టంట్ లోన్స్ సౌక‌ర్యం అందుబాటులోకి రానుంది. యూజ‌ర్లు త‌మ వివ‌రాల‌ను తెలియ‌జేశాక కేవైసీ పూర్తి చేసిన అనంత‌రం 2 నిమిషాల్లోనే లోన్ వ‌చ్చేలా పేటీఎం ఏర్పాట్లు చేసింది. దీంతో డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో త‌క్ష‌ణ‌మే యూజ‌ర్లు రుణం పొంద‌వ‌చ్చు.

కాగా ఇన్‌స్టంట్ లోన్స్‌కు గాను పేటీఎం ప‌లు ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ‌ల‌తో ఒప్పందాలు చేసుకుంది. ఈ క్ర‌మంలో యూజ‌ర్ల‌కు చెందిన క్రెడిట్ స్కోర్‌తోపాటు వారు పేటీఎంలో డ‌బ్బును ఏ విధంగా ఖ‌ర్చు చేస్తున్నారు అనే ప్యాట‌ర్న్‌ల‌ను బ‌ట్టి వారికి రుణాల‌ను ఇస్తారు. ఇక ఇందులో భాగంగా పేటీఎం యూజ‌ర్లు నేరుగా పేటీఎం యాప్‌లోనే రుణం పొంద‌వ‌చ్చు. అందుకు ఇత‌ర యాప్‌ల‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన ప‌నిలేదు. కాగా ఈ ఫీచ‌ర్‌ను త్వ‌ర‌లోనే పేటీఎం ఓ యాప్ అప్‌డేట్ ద్వారా అందివ్వ‌నున్న‌ట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news