నేటి కాలం లో స్మార్ట్ ఫోన్లు మనుషుల దైనందీన జీవితంలో భాగమైపోయాయి. పెద్దలు, పిల్లలు సైతం దీనికి బానిసవుతున్నారు. రోజు మొదలవ్వడం నుండి చివరి వరకు ఇది సాధారణమైపోయింది. అందరు దీనిని అవసరం కంటే ఎక్కువగా వాడుతున్నారు. ఏది ఏమైనా స్మార్ట్ ఫోన్ వినియోగించేటప్పుడు తీసుకోవాల్సిన భద్రతా పరమైన నియమాలు, చిట్కాలను తెలుసుకోవాలి. అవేమిటంటే..
1 . తల్లిదండ్రులు మీకు ఫోన్ ఇవ్వడానికి అనుమతిచ్చారంటే మీరు ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. అయితే వాళ్ళు ఫోన్ ఇచ్చారు కదా అని దుర్వినియోగం చేస్తే అది మీకే నష్టం. కనుక అవసరాన్ని మించి వాడకండి.
2. మీ సెల్ ఫోన్ కు ఎప్పుడూ లాక్ పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల మీ ఫోన్ ఎవరైనా తీసుకున్నా కూడ ఓపెన్ చెయ్యలేరు. కొన్ని ముఖ్యమైన వాటిని మీరు రహస్యంగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా బ్యాంక్ డీటెయిల్స్ వగైరా వాటిని జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. పొరపాటున మీ ఫోన్ ని పాడేసుకున్న, దొంగలించిన డేటా సురక్షితంగానే ఉంటుంది.
3 . ప్రతీ ఒక్కరు ఒత్తిడి నుండి బయటపడాలి. మనకి ప్రతీ రోజు ఎదో ఒక పని ఉంటుంది. ఒత్తిడిని దూరం చెయ్యాలంటే రిలాక్స్ అవ్వాలి. ఫోన్ తో ఎక్కువ సమయం గడపడం వల్ల రిలాక్స్ అవ్వలేరు. కానీ కొంత మంది ఫోన్ తో గడిపితే ఒత్తిడి తగ్గుతుంది అనుకుంటారు కానీ అది పొరపాటు.
4. మీ ఫోన్ తో ఎక్కువ సమయం గడపడం వల్ల మీ సమయం వృధా అవుతుంది. అలానే మీరు మీ విజయాన్ని మరచిపోగలరు లేదా చేరుకోలేరు. కనుక అవసరమైనంత వరకే ఫోన్ ని ఉపయోగించండి. అదే అన్నింటికి మంచిది.