కల్తీకల్లుకు మరొకరు బలి.. ఇంకా ఆసుపత్రిలలోనే వందలాది మంది !

వికారాబాద్ జిల్లాలో కల్తీకల్లుకు మరొకరు బలి అయ్యారు. జిల్లాలోని నవాబుపేట మండలం వట్టిమినేనిపల్లి చెందిన కొమురయ్య అనే 90 ఏళ్ళ వృద్దుడు, హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొమురయ్య మృతితో మృతుల సంఖ్య రెండుకు చేరింది. ఇంకా వికారాబాద్, పరిగి, ఉస్మానియా ఆసుపత్రిలలో వందలాది మంది భాదితులు చికిత్స పొందుతున్నారు. ఇక నిన్న వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీకల్లు బాధితులను తెలంగాణ ఆబ్కారీ కమిషనర్ సర్పరజ్ ఆహ్మద్ పరామర్శించారు.

కల్తీ కల్లు సప్లై చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. ఎన్ని గ్రామాలలో అయితే ఇలా జరగడానికి కారణం అయ్యారో అలాంటి అన్ని షాప్ లు తీసి వేయించామని ఆయన పేర్కొన్నారు. వారి మీద కేసులు నమోదు చేసి  ఘటనకు సంబంధించి వివరాలను తీసుకుంటున్నామని  సర్పారజ్ హైమద్ అన్నారు. ఇక జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది. గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు ఎలాంటి కల్లు అమ్మకుండా చర్యలు తీసుకుంటున్నారు.