బైక్ మీదున్న వారిని గుద్దించి చంపి , యాక్సిడెంట్ గా చిత్రీకరణ !

మనుషుల మధ్య సంబంధాలు అన్నీ ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఆస్తి కోసం సొంత వాళ్ళను కూడా చంపడానికి వెనుకాడడం లేదు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బైక్ పై వెళుతున్న వారిని వాహనంతో తొక్కించి చంపి, యాక్సిడెంట్ గా చిత్రీకరించినట్టు గుర్తించారు.

ఈ ఘటనలో శైలజ(32) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందగా ఆమె భర్త యాదయ్య , కూతురు నిహరిక(15)లు ప్రాణాలతో బయట పడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రస్తుతానికి పోలీసుల అదుపులోనే నిందితులు ఉన్నారని అంటున్నారు. ఆస్తి వివాదాలతో సమీప బందువులే హత్యకు కుట్ర పన్ని సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించినట్టు తేలింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.