రష్మిక ఫేక్‌ వీడియో: డీప్‌ఫేక్‌ టెక్నాలజీ అంటే ఏంటి..? అది అంత డేంజరా..?

రష్మిక మందన్న ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ, పెద్ద పెద్ద ప్రాజెక్టులకు సైన్ చేస్తూ బిజీగా ఉంది. కానీ ఇప్పుడు ఒక వీడియోతో రష్మిక పేరు మారుమోగిపోయింది. అది ఫేక్‌ వీడియో. అయినప్పటికీ ఎక్కడా అది ఫేక్‌ అని గుర్తుపట్టలేని విధంగా ఉంది. అంతలా ఎడిట్‌ చేశారు. పెరుగుతున్న సాంకేతికతను ఇలా వాడితే భవిష్యత్తులో ఆడపిల్లల పరిస్థితి ఏంటి అని ప్రశ్న అందరికి ఉంది.

నటి రష్మిక మందన్న ఫేక్‌ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇలా ఎందుకు చేసిందని చాలా మంది ప్రశ్నించారు. అయితే అది రష్మిక మందన్న వీడియో కాదని ఇప్పుడు తెలిసింది. బదులుగా, అభిషేక్ అనే వ్యక్తి దీనికి సంబంధించిన ఒరిజినల్ వీడియోను కనుగొన్నాడు. రెండు వీడియోలను X లో షేర్ చేశాడు. అది రష్మికది కాదని సాక్ష్యాధారాలతో రుజువైంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో జారా పాటిల్‌కి చెందినదని అభిషేక్ రాశారు. ఈ వీడియోను జరా పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియోలో కొందరు రష్మిక తలకు మాస్క్‌లు వేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. రష్మికది డీప్ ఫేక్ వీడియో అని తెలిసింది.

డీప్‌ఫేక్ వీడియో అంటే ఏమిటి?

డీప్‌ఫేక్ అనేది వీక్షకులను మోసం చేయడానికి విజువల్ మరియు ఆడియో కంటెంట్‌ను రూపొందించడానికి AI మరియు మెషిన్ లెర్నింగ్‌ని ఉపయోగించే సాంకేతికత. ఇది అసలు వీడియో వలె కనిపించే మరొక ఫైల్‌ని ఉత్పత్తి చేస్తుంది. సాంకేతికత ఒక వ్యక్తి ముఖాన్ని స్కాన్ చేస్తుంది మరియు దానిని వీడియో ఫైల్‌లో మాస్క్ చేస్తుంది. ఇది ఒకే వ్యక్తిలా కనిపించే నకిలీ వీడియోను సృష్టిస్తుంది. ఇది ఒకరి ప్రతిష్టకు హాని కలిగించడానికి సులభంగా ఉపయోగించవచ్చు. మీరు లవ్‌టుడే సినిమా చూసినట్లైతే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అందులో హీరోయిన్‌ ఫేస్‌తో కూడా క్లైమాక్స్‌ ట్విస్ట్‌ ఇస్తారు. అయితే అది ఏ టెక్నాలజీతో వాడారు అనే విషయం పక్కనపెడితే.. ఇలాంటి వాటి వల్ల అలాంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం మాత్రం ఉందని ఆందోళన ఇప్పుడు అందరిలో కలుగుతుంది.