నార్జో సిరీస్‌లో రియ‌ల్‌మి రెండు కొత్త ఫోన్లు… ధ‌ర‌లు ఎంతంటే..?

-

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి.. నార్జో (Narzo) సిరీస్‌లో రెండు నూత‌న స్మార్ట్‌ఫోన్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. రియ‌ల్‌మి నార్జో 10, 10ఎ పేరిట ఈ రెండు ఫోన్లు విడుద‌ల‌య్యాయి. వీటిల్లో అందిస్తున్న ఫీచ‌ర్లు, ఈ ఫోన్ల ధ‌ర‌ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

realme launched realme narzo 10 and 10a smart phones in india

రియ‌ల్‌మి నార్జో స్పెసిఫికేష‌న్లు…

* 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* గొరిల్లా గ్లాస్ 3 ప్ల‌స్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెస‌ర్
* 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* 48, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్

రియ‌ల్‌మి నార్జో 10ఎ స్పెసిఫికేష‌న్లు…

* 6.5 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* గొరిల్లా గ్లాస్ 3 ప్ల‌స్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి70 ప్రాసెస‌ర్
* 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
* 12, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 10 వాట్ల ఫాస్ట్ చార్జింగ్

ధ‌ర‌లు…

* రియ‌ల్‌మి నార్జో 10 స్మార్ట్‌ఫోన్ ధ‌ర రూ.11,999 ఉండ‌గా దీన్ని ఫ్లిప్‌కార్ట్‌, రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌ల‌లో మే 18వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు.
* రియ‌ల్‌మి నార్జో 10ఎ స్మార్ట్‌ఫోన్ రూ.8,499 ధ‌ర‌కు ఫ్లిప్‌కార్ట్‌, రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌ల‌లో మే 22వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news