ఐఫోన్‌ను త‌ల‌ద‌న్నే రీతిలో.. 64 మెగాపిక్స‌ల్ భారీ కెమెరాతో.. రియ‌ల్‌మి ఎక్స్‌టీ స్మార్ట్‌ఫోన్‌..

-

దేశంలోనే తొలిసారిగా 64 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాతో రియ‌ల్‌మి మ‌రొక స్మార్ట్‌ఫోన్‌తో మ‌న ముందుకు వ‌చ్చింది. రియ‌ల్‌మి ఎక్స్‌టీ పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను ఆ కంపెనీ శుక్ర‌వారం భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది.

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లతో త‌క్కువ ధ‌ర‌ల‌కే స్మార్ట్‌ఫోన్ల‌ను అందిస్తూ రియ‌ల్‌మి కంపెనీ షియోమీకి గ‌ట్టి పోటీనే ఇస్తోంది. రియ‌ల్‌మికి చెందిన అనేక ఫోన్లు ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల కాగా.. అన్నింటికీ వినియోగ‌దారుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇక ఇప్పుడు దేశంలోనే తొలిసారిగా 64 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాతో రియ‌ల్‌మి మ‌రొక స్మార్ట్‌ఫోన్‌తో మ‌న ముందుకు వ‌చ్చింది. రియ‌ల్‌మి ఎక్స్‌టీ పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను ఆ కంపెనీ శుక్ర‌వారం భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది.

రియ‌ల్‌మి ఎక్స్‌టీ ఫోన్‌లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ దానికి వెనుక భాగంలో ఉన్న 64 మెగాపిక్స‌ల్ భారీ కెమెరాయే అని చెప్ప‌వ‌చ్చు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత భారీ కెపాసిటీ ఉన్న కెమెరాతో ఏ ఫోన్ రాలేదు. ఈ క్ర‌మంలో ఆ జాబితాలో రియ‌ల్‌మి ఎక్స్‌టీ మొద‌టి స్థానంలో నిలిచింది. ఇక దీంతోపాటు ఈ ఫోన్‌లో 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ ఉన్న అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. అలాగే వెనుక భాగంలో ఉన్న ప్యానెల్‌కు కూడా ఇదే ప్రొటెక్ష‌న్ ఉంది. అందువ‌ల్ల ఫోన్ కింద‌ప‌డ్డా అంత సులభంగా ప‌గిలిపోదు. అలాగే ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 712 ప్రాసెసర్‌, 8 జీబీ ర్యామ్‌ను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగ‌వంత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇస్తుంది. ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.

realme xt smart phone launched in India with 64 mega pixel huge camera

ఇక మిగిలిన ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. ఈ ఫోన్‌లో 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్‌ ఆప్ష‌న్ల‌ను అందిస్తున్నారు. అలాగే ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. డాల్బీ అట్మోస్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్ త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్ల‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.15,999 ఉండ‌గా, 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.16,999గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.18,999 ధ‌ర‌కు అందిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 16వ తేదీ సోమ‌వారం నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌, రియ‌ల్‌మి సైట్ల‌లో విక్ర‌యించ‌నున్నారు. కాగా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన మొద‌టి 64వేల మందికి 6 నెల‌ల వాలిడిటీ క‌లిగిన ఉచిత రీప్లేస్‌మెంట్ ఆఫ‌ర్‌ను అందివ్వ‌నున్నారు..!

Read more RELATED
Recommended to you

Latest news