అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన శాంసంగ్ గెలాక్సీ ఎ12 స్మార్ట్ ఫోన్‌

Join Our Community
follow manalokam on social media

శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఎ12 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను మంగ‌ళ‌వారం భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్‌ల‌ను అమ‌ర్చారు. 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా వెనుక వైపు ఉంది. దీంతోపాటు మ‌రో 5 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ మాక్రో, డెప్త్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.

Samsung Galaxy A12 smart phone launched in india

ఈ ఫోన్‌కు ప‌క్క భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. దీంట్లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాటరీని అమ‌ర్చారు. 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ల‌భిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎ12 ఫీచ‌ర్లు…

* 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే
*1560 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెస‌ర్
* 4జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 1 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

శాంసంగ్ గెలాక్సీ ఎ12 స్మార్ట్ ఫోన్ బ్లాక్‌, బ్లూ, వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా.. ఈ ఫోన్‌కు చెందిన 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.12,999 గా ఉంది. అలాగే 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.13,999గా ఉంది. ఈ ఫోన్‌ను బుధ‌వారం నుంచి విక్ర‌యిస్తారు.

TOP STORIES

వనదేవతల జాతర.. మినీ మేడారం

సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తున్నారు. మండమేలిగే పండగ సందర్భంగా...