సొంత గడ్డపై సత్తా చాటాడు. అటు బాల్‌తో.. ఇటు బ్యాట్‌తో దుమ్మురేపాడు. స్టార్ బ్యాట్స్‌మెన్‌లు కూడా తడబడుతున్నపిచ్ పై.. రఫ్ఫాడించాడు. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ తో తన సత్తా ఏంటో నిరూపించాడు చెన్నై చిన్నోడు. జట్టుకు అవసరమైన సమయంలో అండగా నిలబడ్డాడు. అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.
రవిచంద్రన్ అశ్విన్.. బాల్‌తోనే కాదు.. బ్యాట్‌తోనూ సత్తా చాటాడు. టీమిండియా స్పిన్ అటాక్ పెద్దదిక్కులా మారిన ఆష్..ఇటు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి పెద్ద దిక్కు అయ్యాడు. కీలక బ్యాట్స్‌మెన్‌లు అంతా వరుసగా పెవిలియన్ చేరుతున్న సమయంలో జట్టు సారధికి అండగా నిలబడ్డాడు. ఒకానొక సమయంలో కోహ్లీ కంటే వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అశ్విన్‌కి సెంచరీలు కొత్త కాదు.. కానీ జట్టుకు అవసరమైన సమయంలో చెలరేగి ఆడి టీమిండియా పైచేయి సాధించేలా చేశాడు.
చెన్నై టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 106 పరుగులు చేశాడు. నిజానికి రోహిత్, రహానె, పంత్ వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో టీమిండియా 106 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 150 అయినా దాటుతుందా..అని అంతా అనుకున్నారు. అటు కోహ్లీ మరో ఎండ్‌లో పోరాడుతున్నా.. ఆవతలి ఎండ్‌లో సరైన మద్దతు దొరకలేదు. కానీ ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్ చాలా సులువుగా ఆడేశాడు. ఇంగ్లండ్ స్పిన్నర్లు జాక్ లీచ్, మొయిన్ అలీలను సమర్ధంగా ఎదుర్కొన్నాడు. ఫాస్ట్ బౌలింగ్‌లోనూ క్లాసిక్ షాట్లు ఆడాడు. ముఖ్యంగా స్వీప్ షాట్లతో అశ్విన్ అదరహో అనిపించాడు.
టెస్టుల్లో అశ్విన్‌కిది ఐదో సెంచరీ..అది సొంత గడ్డపై కొట్టిన శతకం అయితే తన స్పిన్‌తోనే కాదు.. బ్యాట్‌తోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆటగాడినని నిరూపించుకున్నాడు. ఆల్‌రౌండర్‌గా అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో అశ్విన్ కీలక ఆటగాడు. ముఖ్యంగా భారత స్పిన్ అటాక్‌కి అశ్వినే పెద్ద దిక్కు..మొదటి టెస్ట్‌లో ఏకంగా ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ల నడ్డి విరిచాడు.
ఇక ఈ టెస్ట్‌లో ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో అశ్విన్‌ది కీలక పాత్ర..మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో జాదూ చేశాడు. అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.