గెలాక్సీ ఎ52, ఎ72 ఫోన్ల‌ను లాంచ్ చేసిన శాంసంగ్‌.. ఫీచ‌ర్లు, ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..?

Join Our Community
follow manalokam on social media

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ గెలాక్సీ ఎ52, ఎ72 పేరిట రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను భార‌త్‌లో లాంచ్ చేసింది. ఎ52 ఫోన్‌లో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను ఏర్పాటు చేయ‌గా దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అలాగే గెలాక్సీ ఎ72 స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి కూడా 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ల‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ల‌ను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 32 మెగాపిక్స‌ల్ పంచ్ హోల్ కెమెరాలు ఉన్నాయి.

samsung galaxy a52 a72 smart phones launched

ఈ ఫోన్ల‌లో ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ల‌భిస్తుంది. వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్ కూడా ఉంది. వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడు మ‌రో 12 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. ఎ52లో 5 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్ ఉండ‌గా, ఎ72లో 8 మెగాపిక్స‌ల్ టెలిఫొటో కెమెరా ఉంది. దీనికి 30ఎక్స్ వ‌ర‌కు స్పేస్ ఎక్స్ జూమ్ ల‌భిస్తుంది. ఎ52 ఫోన్‌లో 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేయ‌గా, ఎ72లో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఇచ్చారు. రెండింటికీ ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ల‌భిస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ ఎ52 ఫీచ‌ర్లు…

* 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే
* 1080×2400 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 720జి ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్
* 128 జీబీ స్టోరేజ్, 1 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 11
* హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 64, 12, 5, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 32 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ఫ్రింట్ సెన్సార్
* శాంసంగ్ పే, డాల్బీ అట్మోస్, వాట‌ర్ రెసిస్టెన్స్, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
* 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

శాంసంగ్ గెలాక్సీ ఎ72 ఫీచ‌ర్లు…

* 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే
* 1080×2400 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 720జి ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్
* 128/256 జీబీ స్టోరేజ్, 1 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 11
* హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 64, 12, 8, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 32 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ఫ్రింట్ సెన్సార్
* శాంసంగ్ పే, డాల్బీ అట్మోస్, వాట‌ర్ రెసిస్టెన్స్, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

గెలాక్సీ ఎ52కు చెందిన 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌ర రూ.26,499 ఉండ‌గా, 8జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌ర రూ.27,999గా ఉంది. గెలాక్సీ ఎ72 ఫోన్ 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.34,999 ఉండ‌గా, 256 జీబీ మోడల్ ధ‌ర రూ.37,999గా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుల‌తో ఈ ఫోన్ల‌పై డిస్కౌంట్ల‌ను పొంద‌వ‌చ్చు.

TOP STORIES

కరోనా సెకండ్ వేవ్: యువతలో కనిపించే 6 అసాధారణ లక్షణాలివే..!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. అయితే తాజాగా...