Samsung Galaxy Note 10 : ఇండియా ‘నోట్‌’ వచ్చేసింది

-

సామ్‌సంగ్‌ ప్రతిష్టాత్మక నోట్‌ 2019 ఫోన్‌, ‘గెలాక్సీ నోట్‌ 10’, 10+లు భారత మార్కెట్‌లో ఈనెల 23నుండి లభించనున్నాయి. సామ్‌సంగ్‌ ‘మేకిన్‌ ఇండియా’, మేడ్‌ ఫర్‌ ఇండియా’, మేడ్‌ ఫర్‌ వరల్ట్‌’  ఇనిషియేటివ్‌లలో భాగంగా పూర్తిగా భారత్‌లో తయారైన ఈ ఫోన్‌, ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోనుంది. మొదటిసారిగా బెంగళూరు సామ్‌సంగ్‌ రిసెర్చ్‌ ఇన్సిట్యూట్‌ అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌ మాడ్యూల్స్‌ కూడా ఇందులో నిక్షిప్తం చేసారు.

Samsung Galaxy Note 10 launched in India
Samsung Galaxy Note 10 launched in India

సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్ 10, గెలాక్సీ నోట్ 10+ లను మంగళవారం భారతదేశంలో లాంఛనంగా విడుదల చేశారు. తాజా గెలాక్సీ నోట్-సిరీస్ మోడల్స్ రెండూ ఈ నెల ప్రారంభంలో న్యూయార్క్‌లో ఆవిష్కరించబడ్డాయి. అధికారికంగా ప్రారంభించిన వెంటనే, దక్షిణ కొరియా దిగ్గజం భారత మార్కెట్లో గెలాక్సీ నోట్ 10 మరియు గెలాక్సీ నోట్ 10+ లకు ముందస్తు ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించింది, ఆ సమయంలో, వాటి ధరలను కూడా వెల్లడించింది. ఆగస్టు 23 నుండి దేశంలో కొత్త హ్యాండ్‌సెట్ల అమ్మకాలు ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. భారత వినియోగదారులను ఆకర్షించడానికి, గెలాక్సీ నోట్ 10 మరియు గెలాక్సీ నోట్ 10+ రెండూ నాలుగు భారతీయ భాషలను ఎస్ పెన్ చేతివ్రాతతో గుర్తిస్తాయి. అవి హిందీ, హింగ్లిష్, మరాఠీ మరియు ఉర్దూ.

భారతదేశంలో సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్ 10, గెలాక్సీ నోట్ 10+ ధర, ప్రీ-బుకింగ్ వివరాలు

Samsung Galaxy Note 10 launched in India
Samsung Galaxy Note 10 launched in India

భారతదేశంలో సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్ 10 ధరను 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు 69,999 రూపాయలుగా. మరోవైపు సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్ 10+ ధర 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో 79,999 కాగా, 512 జీబీ స్టోరేజ్ ధర రూ. 89.999.

సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్ 10 మరియు గెలాక్సీ నోట్ 10+ లను ఆరా బ్లాక్, ఆరా గ్లో మరియు ఆరా వైట్ వర్ణాలలో తీసుకువచ్చింది. ఇంకా, ప్రత్యేకంగా ఆరా రెడ్ కలర్ వేరియంట్ కూడా ఉంది.

సరికొత్త గెలాక్సీ నోట్ ఫోన్‌లను ప్రీ-ఆర్డరింగ్ చేసే వినియోగదారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా రిటైల్ అవుట్‌లెట్‌లు మరియు సామ్‌సంగ్‌ ఆన్‌లైన్ స్టోర్లలో కొంటే 6,000 రూపాయలు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్, మరియు టాటా క్లిక్ వద్ద ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా ప్రీ-ఆర్డరింగ్ చేసే వినియోగదారులకు 6,000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఉంది. ప్రీ-బుకింగ్ ఆఫర్లలో భాగంగా, గెలాక్సీ నోట్ 10 మోడళ్లను కొనుగోలు చేసే కస్టమర్లు గెలాక్సీ బడ్స్‌ను రూ. 9,999 సాధారణ ధర బదులుగా రూ. 4,999 లకు, సామ్‌సంగ్‌ గెలాక్సీ వాచ్ యాక్టివ్‌ను రిటైల్‌ ధర రూ. 19,990కి బదులుగా రూ. 9,995కు ఇస్తున్నారు.

డ్యూయల్ సిమ్ (నానో) సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్ 10 ఆండ్రాయిడ్ 9 పైని సరికొత్త వన్ యుఐతో అందంగా, సుఖవంతంగా తయారుచేసారు. డైనమిక్ అమోలేడ్ ప్యానల్‌తో పాటు 6.3-అంగుళాల పూర్తి-హెచ్‌డి + (1080×2280 పిక్సెల్స్) ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే ఉంది. హ్యాండ్‌సెట్‌లో ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9825 SoC ఉంది, వీటితో పాటు 8GB ర్యామ్‌ ఉంది.

ఫోటోలు మరియు వీడియోల కోసం, గెలాక్సీ నోట్ 10 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు వైడ్ యాంగిల్ (77 డిగ్రీల) లెన్స్‌తో వేరియబుల్ ఎపర్చరు (ఎఫ్ / 1.5-ఎఫ్ / 2.4) ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS). ఈ సెటప్‌లో 16 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా ఉంది, ఇది అల్ట్రా-వైడ్ యాంగిల్ (123 డిగ్రీలు) లెన్స్‌తో ఎఫ్ / 2.2 ఎపర్చరును కలిగి ఉంటుంది మరియు ఎఫ్ / 2.1 టెలిఫోటో లెన్స్ (45 డిగ్రీలు) ఇంకా ఓఐఎస్ సపోర్టుతో 12 మెగాపిక్సెల్ తృతీయ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

Samsung Galaxy Note 10 launched in India
Samsung Galaxy Note 10 launched in India

సెల్ఫీల కోసం, గెలాక్సీ నోట్ 10 లో హోల్-పంచ్ డిజైన్ ఉంది, దీనిలో 10 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్, ఎఫ్ / 2.2 లెన్స్‌తో 80 డిగ్రీల ఫీల్డ్ వ్యూ ఉంటుంది. సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్ 10 లో 256GB స్టోరేజి ఉంది. కనెక్టివిటీలో 4 జి (ఎల్‌టిఇ క్యాట్. 20), Wi-Fi 802.11ax, బ్లూటూత్ v5.0, NFC, MST, GPS / A-GPS మరియు USB టైప్-సి పోర్ట్. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బేరోమీటర్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, నియర్‌ సెన్సార్, ఆర్‌బిజి లైట్ సెన్సార్ మరియు అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.

పవర్‌ విషయానికొస్తే, సామ్‌సంగ్‌ నోట్ 10, 3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగివుంది, ఇది 25W ఛార్జర్‌తో పాటు పనిచేస్తుంది. పరిమాణం 151×71.8×7.9mm మరియు 168 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.

గెలాక్సీ నోట్ 10 మరియు గెలాక్సీ నోట్ 10+ మధ్య చాలా హార్డ్‌వేర్‌పరంగా చాలా సారూప్యతలు ఉన్నాయి. రెండు ఫోన్లు కూడా ఎస్ పెన్ సపోర్ట్‌తో వస్తాయి మరియు ఆండ్రాయిడ్ పై ఆధారంగా వన్ యుఐతో పనిచేస్తాయి.

ప్రధాన ఫోన్‌ అయిన, గెలాక్సీ నోట్ 10+ లో 6.8-అంగుళాల పెద్ద QHD + (1440×3040 పిక్సెల్స్) ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్‌లో 12 జిబి ర్యామ్, రెండు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి – 256 జిబి మరియు 512 జిబి రెండింటినీ మైక్రో ఎస్‌డి కార్డ్ (1 టిబి వరకు) ద్వారా పెంచుకోవచ్చు.

ఇక కెమెరా విషయానికొస్తే, గెలాక్సీ నోట్ 10+ లో నోట్‌ 10లో ఉన్నట్లు అదే వెనుక కెమెరా సెటప్ ఉంది, అయితే అదనంగా డెప్త్‌ విజన్‌ కెమెరా ఉంది.

సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్ 10+ 4,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు చేస్తుంది. ఫోను పరిమాణం 162.3×77.2×7.9mm కాగా, 196 గ్రాముల బరువు ఉంటుంది.

సాఫ్టవేర్‌పరంగా, దాదాపు నిరుటి ఎస్‌10ను పోలివున్నా, కొన్ని ప్రత్యేకతలు నోట్‌కు స్వంతం. భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, తమ బెంగళూరు పరిశోధనాకేంద్రంలో అభివృద్ధి చేసిన ఏఆర్‌ డూడుల్‌ లాంటి చాలా ఫీచర్లు ఇందులో జోడించబడ్డాయి.
ఏదేమైనా, సామ్‌సంగ్‌ తమ నోట్‌ 10 ద్వారా మరింత భారతీయతను సంతరించుకుంది.

– చంద్రకిరణ్‌

Read more RELATED
Recommended to you

Latest news